సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:51 PM
సమాచార హక్కు చట్టంపై గ్రామ, మండలస్ధాయి అధికారులు తగు అవగాహనను పెంపొందించుకొని అందులోని సెక్షన్ల ప్రాధాన్యతను తెలుసుకోవాలని కడప మండల వ్యవసాయాధికారి సురే్‌సకుమార్‌రె డ్డి పేర్కొన్నారు.
కడప రూరల్, అక్టోబర్ 21(అంధ్రజ్యోతి) : సమాచార హక్కు చట్టంపై గ్రామ, మండలస్ధాయి అధికారులు తగు అవగాహనను పెంపొందించుకొని అందులోని సెక్షన్ల ప్రాధాన్యతను తెలుసుకోవాలని కడప మండల వ్యవసాయాధికారి సురే్‌సకుమార్‌రె డ్డి పేర్కొన్నారు. సోమవారం కడప మండల వ్యసాయ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6,7(1) ప్రకారం, దరఖాస్తుచేసుకున్న వ్యక్తులకు 30 రోజుల్లో సమాచారాన్ని పూర్తిస్థాయిలో ఇవ్వాల్సి ఉందన్నారు. సెక్షన్ 4(1) ప్రకారం కార్యాలయ ఆవరణంలో సమాచార హక్కు బోర్డును ఏర్పాటుచేసి అందులో పౌర సమాచార అధికారి, సహాయ అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లతో పాటు వారి హోదా, మొబైల్ నెంబర్ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలన్నారు. అలాగే సెక్షన్ 7,8,9,19(1)ల గురించి తెలియజేశారు.
Updated Date - Oct 21 , 2024 | 11:51 PM