ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా విజయదశమి వేడుకలు

ABN, Publish Date - Oct 14 , 2024 | 12:01 AM

మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో విజయదశమి వేడుకలను శని వారం అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు.

మదనపల్లె మడికయ్యల శివాలయంల చండీ హోమంలో పాల్టొన్న టీడీపీ సమన్వయకర్త మార్పూరి సుఽధాకర్‌నాయుడు మదనపల్లె దుర్గమ్మతల్లి

మదనపల్లెఅర్బన/తంబళ్లపల్లె/పీలేరు, అక్టోబరు 13: మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో విజయదశమి వేడుకలను శని వారం అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు. మదనపల్లె పట్టణంలోని పలుఆలయాల్లో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిం చారు. కోర్టులో గంగమ్మ ఆలయంలో ఆలయకమిటీ సభ్యులు అమ్మ వారినికి బంగారు కిరీటం అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిం చారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరీదేవిని ఎమ్మెల్యే షాజహాన బాషా తోపాటు టీడీపీ నాయకులు ఎస్‌ఏ మస్తాన, జేసీబీ వేణు, కమలమరికృష్ణ, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్‌, రామిశెట్టి రత్నమయ్య, పవన కుమార్‌లు కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సకాలు ఎమ్మె ల్యే చేతుల మీదుగా అందజేశారు. ఆలయంలో జ్యోతులను ఊరేగింపు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరాదేవి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌, ఉపాధ్యక్షుడు దేవతాసతీష్‌, కార్యదర్శి సూరేగిరిధర్‌లు ఉదభయదారులు కలిసి పూర్ణహుతిని చండీహోమంలో సమర్పించారు. ఉదయాన్నే మహిళలు ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంల నుంచి గంగను తెచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. సాయం త్రం ధనలక్ష్మీ అలంకరణలో పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే షాజహా నబాషా కన్యకాపరమేశ్వరీదేవిని దర్శించుకున్నారు. దేవతాన గర్‌లో రాజరాజేశ్వరీ ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. మండ లం లోని మడికయ్యల శివాలయంలో చండీ హోమం నిర్వహించారు. పీలే రు పట్టణంలోని అమ్మవారి ఆలయాలో శరన్నవరాత్రి ఉత్సవాలు శని, ఆదివారాల్లో వైభవంగా నిర్వహించారు. పీలేరు గ్రామదేవత రౌద్రాల అంకాళమ్మ, మోడల్‌ కాలనీ వద్దనున్న యల్లమ్మ తల్లి రాజరా జేశ్వరి అలంకారంలో, నెహ్రూబజారులోని కన్యకా పరమేశ్వరి అమ్మ వారు విజయలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ విగ్రహానికి విజ య లక్ష్మి అలంకరణతోపాటు ఆలయంలోని మూలవిరాట్టుకు బంగారు, చీర, కెంపులహారంతో అత్యంత సుందరంగా అలంకరించారు. రౌద్రాల అంకాళమ్మ, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహిం చారు. పట్టణంలోని కాశీ విశాలాక్షి సమేత శివాలయం, తిరుపతి రోడ్డులోని చౌడేశ్వరి ఆలయం, అగ్రహారం అష్టలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తంబళ్లప ల్లె మండలంలో విజయదశమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శివాలయం, రామాలయం, శేష సాయిబాబా ఆలయాల్లో అమ్మవారిని కొలువు దీర్చి విశేషంగా అలంకరణలు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో కొలువుదీరిన పార్వతీ దేవి అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శేష సాయి బాబా ఆలయంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

నిమ్మనపల్లిలో: విజయదశమి సందర్భంగా నిమ్మనపల్లి పంచాయతి పెద్దమాదిగపల్లి వెలసిన మాతమ్మతల్లి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్థిని ఽ అంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవ రాత్రులు చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయాని వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ములకలచెరువులో: మండలంలో విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మండలంలోని సోంపాళ్యంలో వెలసిన పురాతన మత్కోట చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు పూజలు చేశారు. ములకలచెరువులోని పీటీఎం రోడ్డులో వెలసిన వాసవీ కన్నకాపరమేశ్వరి దేవి అమ్మవారు వెండి కవచం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

గుర్రంకొండలో:గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మ కొండ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులను కరుణిం చారు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అర్చన, పం చామృతాభిషేకం, విశేష పూజలను చేశారు. అలాగే గుర్రంకొండ పోలే రమ్మ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులను కటాక్షించారు. ఆల యానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయా ఆల యాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం యోగభోగేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలకు గాజులు పంపిణీ చేశారు. అనం తరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఆలయ ఆవరణలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయ కర్త మార్పూరి సుధాకర్‌నాయుడు, టీడీపీ నాయకులు టీ, కృష్ణప్పనాయుడు, ఎంఎస్‌ఆర్‌ టమోటా మండియాజ మాని డి.వెంకటశే షారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కలకడలో:దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా పండుగను మండల ప్రజలు వేడుకగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ వృత్తి వారు తమ జీవనాధారమైన పరికరాలు, పనిముట్లకు పూజలు చేశారు. చౌడేశ్వరిదేవి ఆలయాలలో అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చారు. పలువురు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కు లు తీర్చుకొన్నారు.

కురబలకోటలో: మండలంలో విజయదశమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండలంలోని అంగళ్ళు, కురబలకోట, పిచ్చలవాండ్లప ల్లె, కమతంపల్లె, మొలకవారిపల్లె తదితర గ్రామాల్లోని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా శనివారం విజ యదశమి పండుగ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. మండలం లోని గండబోయనపల్లె సత్యమ్మతల్లి ఆలయంలో అమ్మవారు రాజరాజే శ్వరిదేవిగాను, కోనేటివీధి శివాలయంలో కామేశ్వరిదేవిగా, కన్యకాపరమే శ్వరి ఆలయంలో వాసవాంబదేవి అలంకరణలు, పుష్పయాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈకార్యక్రమాలలో సత్యమ్మతల్లి ఆలయ చైర్మన పులి సత్యారెడ్డి, ఆలయాల ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 12:01 AM