ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.1.30 కోట్లతో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:21 PM

మండలంలోని బలసింగాయపల్లెలో రూ.1.30 కోట్లతో నరసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది.

చెన్నూరు బలసిగాయపల్లెలో నిర్మాణంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం

చెన్నూరు, సెప్టెంబరు 3: మండలంలోని బలసింగాయపల్లెలో రూ.1.30 కోట్లతో నరసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది. చాలా ఏళ్లుగా గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు నిర్ణయించుకున్నా పలు కారణాలతో నిర్మాణానికి నోచుకోలేదు. ఎట్టకేలకు కొందరు కలిసి తమ వంతుగా రూ.12.70 లక్షలు ప్రభుత్వానికి వాటాగా చెల్లించడంతో అందుకు రూ.50.30 లక్షలు ప్రభుత్వం తన వాటాగా ఇచ్చింది. మొత్తం రూ.63 లక్షలతో పూర్తి గ్రానైట్‌తో ఆలయ నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 6న ప్రారంభించారు. కాగా ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రహరీతో కలిపి రూ.1.30 కోట్లు ఖర్చు కానున్నట్లు నిర్వాహకులు ఓ.విజయభాస్కర్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, శివారెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.60 లక్షలు ఖర్చు కాగా మిగలిన రూ.70 లక్షలు దాతల ద్వారా సేకరించి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.

Updated Date - Sep 03 , 2024 | 11:21 PM

Advertising
Advertising