ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవాలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:58 PM
సీపీఐ శత వార్షికోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు.
కడప సెవెన రోడ్స్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీపీఐ శత వార్షికోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. గురువారం సీపీఐ కార్యాలయంలో జరిగిన పార్టీ శత వార్షికోత్సవాల్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పాల్గొని మాట్లాడారు. సీపీఐ 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో ఆవిర్భవించి 2024 డిసెంబరు 26 నాటికి వంద సంవత్సరాలు పూర్తిచేసుకొని శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతోదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పార్టీ శాఖలు అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించి, జెండా ఆవిష్కరణ, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు వార్షికోత్సవ సభల సమావేశాలు నిర్వహించారన్నారు. సీపీఐ నగర కార్యదర్శ ఎన.వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎన.విజయలక్ష్మి, మద్దిలేటి పాల్గొన్నారు.
‘త్యాగాలకు ప్రతిరూపం సీపీఐ’
కడప మారుతీనగర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): త్యా గాలకు ప్రతిరూపం సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గుంటి వేణుగోపాల్, ఎన.విజయలక్ష్మి కొనియాడారు. సీపీఐ 100వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం ఎర్రముక్కపల్లె సర్కిల్‌లో ఉ పాధ్యాయ ఉద్యమ నేత, సీనియర్ నాయకుడు రాజాసాహెబ్ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
ఈ నెల 28న శనివారం తలపెట్టిన సీపీఐ శత జ యంతి ఉత్సవాల ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని వేణుగోపాల్ కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగార్జునరెడ్డి, రామక్రిష్ణ, ఏఐటీయూసీ నాయకులు సుబ్బరాయుడు, తారక రామారావు, శాంతమ్మ, రేణుక కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల కోసం సీపీఐ పోరాటం
వేంపల్లె, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకటరాములు, సహాయ కార్యదర్శి బ్రహ్మం పేర్కొన్నారు. పార్టీ జండాను ఆవిష్కరించారు.
అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం
వీరపునాయునిపల్లె, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలంలోన యు.రాజుపాలెం గ్రామంలోన అమరవీరుల స్తూపాల వద్ద పతాకాన్ని ఎగరవేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీపీఐ కమలాపురం ఏరియా కార్యవర్గ సభ్యులు చెండ్రాయుడు, దస్తగిరి,చంద్రకాంత,ఏఐఎ్‌సఎ్‌ఫ జిల్లా సహాయ కార్యదర్శి పి.చక్రధర్, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:58 PM