ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హంద్రీ-నీవాతో సాగు, తాగునీరిస్తాం

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:48 PM

హంద్రీ-నీవా జలాలతో పంట పొలాలకు సాగు, ప్రజలకు తాగునీటిని అందివ్వడమే సీఎం చంద్రబాబు నాయు డు ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

కురబలకోటలో హంద్రీ-నీవా కాలువను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

కురబలకోటలో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహానబాషా నేతృత్వంలో మంత్రికి టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం

కురబలకోట, సెప్టెంబరు 23: హంద్రీ-నీవా జలాలతో పంట పొలాలకు సాగు, ప్రజలకు తాగునీటిని అందివ్వడమే సీఎం చంద్రబాబు నాయు డు ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమ వారం మండలంలోని దొమ్మన్నబావి సమీపంలో హంద్రీ-నీవా కాలువ ను మంత్రి పరిశీలించి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా హంద్రీ-నీవాను పూర్తి చేసి నీటిని సరఫరా చేశామని, వచ్చే సీజనకు పూర్తి నీటిని అందించి రైతాంగాన్ని ఆదుకుం టామన్నారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పనులకు సం బంధించి పూర్తి వివరాలను అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహానభాషా, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘా స్వరూప్‌, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జయచంద్రారెడ్డి, రాజం పేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, గుత్తికొండ త్యాగ రాజు. పర్వీనతాజ్‌, ఖలీల్‌, రాఘవరెడ్డి, అయూబ్‌బాషా, పాల్గొన్నారు.

చిప్పిలిని ముంపు నుంచి కాపాడండి

మదనపల్లె టౌన, సెప్టెంబరు 23: హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల సంద ర్శనకు వచ్చిన రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానా యుడును చిప్పిలి గ్రామస్థులు కలిసి వరద ముంపు నుంచి గ్రామాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా చిప్పిలి గ్రామస్థులు మాట్లాడు తూ ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణంతో తమ గ్రామం ముంపునకు గురవు తోందని, దీనికి గ్రామంలోకి నీరు రాకుండా రక్షణ కట్ట నిర్మించార ని కాని చిప్పిలి గ్రామానికి ఎగువన గుట్ట, ప్రాంతాల్లో వర్షం పడితే ఈ వర్షపు నీరంతా ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి, ట్యాంకు కిందికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయి నీరంతా తమ గ్రామంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తు న్నాయన్నారు. ఈవిషయమై మంత్రి సమీక్షించి నీరు నిల్వ ఉండకుం డా చర్యలు తీసుకోవాలని హెచఎనఎస్‌ఎస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా అంతకు ముందు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన బాషా నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి రామా నాయుడుకు ఘన స్వాగతం పలికారు. సోమవారం స్థానిక చిప్పిలి గ్రామం వద్ద మంత్రికి పుష్ఫగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా స్వాగతం పలి కారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్‌ఏ మస్తాన, మార్పుని గాంధి, నాదెళ్ల శివన్న, మార్పురి వరుణ్‌, నిరంజననాని, సంగం హరి తదితరులు పాల్గొన్నారు.

హంద్రీ-నీవా జలాలను బాహుదాకు అనుసంధానించాలి

నిమ్మనపల్లి, సెప్టెంబరు 23: మండలంలోని బాహుదా ప్రాక్టుకు హద్రీ- నీవా జలాలను అనుసంధానం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మలరామానాయుడుకు టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట రమణ, రాజంపేట టీడీపీ బీసీసెల్‌ అధ్యక్షుడు లక్ష్మన్న వినతి పత్రం ద్వారా విన్నవించారు. సోమవారం మదనపల్లి సమీపంలోని చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ను పరిశీలించేందుకు వచ్చిన మంత్రికి మండల పరిస్థితుల గురించి వివరించారు. వారు మాట్లాడుతూ బాహుదా ప్రాజక్టు పూర్తి స్థాయిలో నిండితే దాదాపు 3వేల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. రైతులు కేవలం వర్షాన్ని నమ్ముకొని పంటలను వేసి జీవనం కొనసాగిస్తుట్లు తెలిపారు. హంద్రీ-నీవా జలాలను బాహుదాకు అనుసంధానం చేస్తే నిమ్మనపల్లితో పాటు వాల్మీకిపురం, పీలేరు మండ లాలకు తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. స్పదించిన మంత్రి ఖచ్చితంగా హంద్రీ-నీవా జలాలను బాహుదాకు అనుసంధానం చేస్తా మని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు విజ య్‌, చినబాబు, చెండ్రాయుడు, గోపాలక్రిష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన టీడీపీ నేతలు

ములకలచెరువు, సెప్టెంబరు 23: బి.కొత్తకోట మండలం హార్సి లీహిల్స్‌లో సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడిని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ మండల అధ్యక్షులు పాలగిరి సిద్ధా, బిల్డర్‌ రమణ, ఆనందరెడ్డి, నారాయణస్వామిరెడ్డి, బంగారు వెంకటరమణ, నేతలు కుడుం శ్రీని వాసులు, వైజీ రమణ, చెన్నకిష్టా, కేశవులు, ముత్తకూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, రామకృష్ణమరాజు, సోము, ఉమా తదితరులు మంత్రిని కలిసి పుష్పగుచ్చలు అందజేశారు. ఈ సందర్భంగా తంబళ్లప ల్లె నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యలపై నాయకుల ఏకరువు

బి.కొత్తకోట, సెప్టెంబరు 23: రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహన రాజు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, తంబళ్లపల్లె నియోజకవర్గ నాయకుడు జయచంద్రారెడ్డి, పోల్‌మేనేజ్మెంట్‌ కన్వీనర్‌ కుడుం శ్రీనివాసులు తదితరులు హిల్స్‌ కు చేరుకొని సమస్యలు విన్న వించారు. నియోజకవర్గ సమస్యలు, హంద్రీ-నీవా కాలువ ద్వారా చేపట్టాల్సిన పనులు, నింపాల్సిన స్థానిక చెరువుల గురించి మంత్రికి వివరించారు. ముదివేడు రిజర్వాయర్‌ కోసం తాము వ్యవసాయ భూ ములు కోల్పోయామని, తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరి హారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి అమలు చేయాలని మండలంలోని చౌటకుంటపల్లి గ్రామస్థులు మంత్రికి వినతి పత్రంతో విన్నవించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మంత్రి మదనపల్లె పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు. మొదటిసారి అన్నమయ్య జిల్లా పర్య టనకు వచ్చిన మంత్రి ఆదివారం అనంతపురం, సత్యసాయి జిల్లాల పర్యటన ముగించుకొని రాత్రి 12 గంటలకు బి.కొత్తకోట మండలం లోని పర్యాటక కేంద్రం హార్స్‌లీహిల్స్‌ కు చేరుకున్నారు. అధికారులు ప్రోటోకాల్‌ మేరకు గవర్నర్‌ బంగ్లాలో విడిది ఏర్పాట్లు చేశారు.

Updated Date - Sep 23 , 2024 | 11:48 PM