కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను క్రమబద్దీకరించాలని వినతి
ABN, Publish Date - Sep 13 , 2024 | 11:18 PM
కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకునేలా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాజ్యసభ్య మాజీ సభ్యుడు తులసిరెడ్డికి కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు వినతిపత్రం సమర్పించారు.
వేంపల్లె, సెప్టెంబరు 13: కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకునేలా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాజ్యసభ్య మాజీ సభ్యుడు తులసిరెడ్డికి కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు వినతిపత్రం సమర్పించారు. వేంపల్లెలో శుక్రవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. 115 జీఓను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తులసిరెడ్డి హామీ ఇచ్చారు.
Updated Date - Sep 13 , 2024 | 11:18 PM