చంద్రబాబుతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:07 PM
తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రామాపురం, ఏప్రిల్ 7: తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాచపల్లె పంచాయతీ మంగళపల్లి, హరిజనవాడ, చిన్నకోడివాండ్లపల్లె, నడింపల్లి, ఎగువకొవ్వూరువాండ్లపల్లె, దిగువ కొవ్వూరువాండ్లపల్లి, కొవ్వూరువాండ్లపల్లె, బీదవాండ్లపల్లె, సరస్వతిపల్లె పంచాయతీలో హరిజనవాడ, నాయునివారి పల్లె, ఉడుంవారిపల్లె, సరస్వతిపల్లి కస్పాలో ఆదివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సరస్వతి పల్లిలోని భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార దర్పంతో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అలాంటివి తన దృష్టికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగసుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు గడికోట భాస్కర్‌రెడ్డి, చెన్నూరు బాబు, వెంకట్రమణనాయుడు, కదిరప్పనాయుడు, రఘునాథ నాయుడు, అన్నమయ్య, శివయ్య, వెంకట్రామరాజు, చిట్టి రెడ్డెయ్య, నాగభూషణ్‌రెడ్డి, గురిగింజకుంట గంగాధర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.