ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Oct 02 , 2024 | 11:38 PM

మదనపల్లెలో బుధవారం నుంచి ఈ నెల 11 వరకు దసరా మహోత్సవాలు పలు ఆలయాల్లో నిర్వహించనున్నారు.

వాల్మీకిపురంలో నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివాలయం

మదనపల్లె అర్బన అక్టోబరు2: మదనపల్లెలో బుధవారం నుంచి ఈ నెల 11 వరకు దసరా మహోత్సవాలు పలు ఆలయాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓం ప్రకాష్‌, ఆర్యవైశ్య అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు ప్రత్యేక అలంకరణలు, అర్చనలు, విశేష పూజలు, అన్నదానం నిర్వహిస్తామన్నారు. స్థానిక చౌడేశ్వరీదేవి ఆలయంలో బుధవారం నుంచి దసరా ఉత్స వాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ అధ్య క్షుడు పురాణం చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు రామిశెట్టి రత్న మయ్య, ట్రెజరర్‌ తెలిపారు. విద్యుత అలంకరణలతో ఆల యం శోభాయానుమానంగా అలంకరించారు. కోర్టు ఆవర ణలో వెలిసిన కోర్టులో గంగమ్మకు విజయదశమి పురస్క రించుకుని దేవీ నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేపసినట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. దేవతాన గర్‌లోని రాజరాజేశ్వరీ ఆలయంలో దసరా సందర్భంగా విశేషపూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పతాంజలీ స్వామి తెలిపారు. స్థానిక అనపగుట్టలోని అభయ లక్ష్మీనర సింహా ఆలయంలో అమ్మవారికి దసరా సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు రమేష్‌ తెలి పారు. నేటి నుంచి 12 వరకు పూజలు ఉంటాయన్నారు.

నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబు

వాల్మీకిపురం, అక్టోబరు 2: వాల్మీకిపురం మండలం వ్యాప్తం గా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు సర్వాంగ సుంద రంగా ముస్తాబయ్యాయి. స్థానిక కోనేటివీధిలోని లక్ష్మీకా మేశ్వరస్వామి ఆలయం, బజారు వీధిలోని వాసవీ అమ్మ వారి ఆలయం, బైపాస్‌ రోడ్డులోని నలవీర గంగాభవాని అమ్మవారి ఆలయం, మండలంలోని చింతపర్తిలోని వాసవీ ఆలయం, గండబోయనపల్లెలోని సత్యమ్మ తల్లి దేవత ఆలయాలలో గురువారం నుండి 9రోజుల పాటుగా ఉత్స వాలు వైభవంగా జరగనున్నాయి.

రేణుక యల్లమ్మ ఆలయంలో ఉత్సవాలు

పెద్దతిప్పసముద్రం అక్టోబర్‌ 2 : మండలంలోని రంగసము ద్రం గ్రామంలో వెలసిన రేణుక యల్లమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతు న్నట్లు రంగసముద్రం గ్రామస్థులు తెలిపారు. ప్రతి సంవ త్సరం ఆనవాయితీగా దసరా మహోత్సవాలను నిర్వహిం చేందుకు గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు నిర్ణయిం చారు. ఈనెల 12వ తేదీ వరకు అమ్మవారిని సుందరంగా అలంకరించి దేవి నవరాత్రిపూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 11:38 PM