ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రీ సర్వే ద్వారా రైతులకు అవస్థలు

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:01 AM

రైతుల సమస్యలను వినతిపత్రం ద్వారా తెలియజేస్తున్న రఘునాథరెడ్డి తదితరులు

వేంపల్లె, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రీసర్వే వల్ల ప్రసు ్తతం రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్‌ హరినాథరెడ్డిని వేంపల్లె మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథరెడ్డి కోరారు. గురువారం నిర్వహించిన మండలంలోని ముతుకూరు రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తహసీల్దార్‌ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు సమస్యలు ఉన్నందున కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని ఆ యన కోరారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తహసీల్దార్‌ తెలిపారు. టీడీపీ మండల కన్వీనర్‌ మునిరెడ్డి, పక్కీరారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, జయరామ్‌, శ్రీనివాసులరెడ్డి, రోశిరెడ్డి, గోవర్దనరెడ్డి, సర్వేయర్‌ గంగయ్య, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:01 AM