ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫారంపాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలి

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:32 AM

ప్రతి రైతు తమ తోటలలో ఫారంపాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలని పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌ స్టేట్‌ జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ సూచించారు.

పెద్దకుడాల గ్రామంలో చీనీతోటను పరిశీలించి రైతులకు సూచనలిస్తున్న జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌

లింగాల, అక్టోబరు 6: ప్రతి రైతు తమ తోటలలో ఫారంపాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలని పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌ స్టేట్‌ జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ సూచించారు. మండలంలోని పెద్దకుడాల గ్రా మంలో ఉపాధి హామీ పథకం పనులను ఆ యన అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కింద జరిగిన పనులు, పండ్లతోటలు పెంపకం, పాఠశాలల్లో పచ్చదనం పెంచేందుకు నాటిన మొక్కలు, డ్రాగనఫ్రూట్‌ తోటలను పరిశీలించారు. ముందుగా చీనీతోటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొక్కల సరఫరా, బిల్లులు తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులు తమపొలాల్లో ఫారంపాండ్‌లను ఏర్పాటుచేసుకోవాలన్నారు. భూగర్బజలాలు తగ్గముఖం పట్టినపుడు ఫారంపాండ్‌లలో నీటిని నిల్వ చేసుకొని అవసరమైనపుడు వాడుకోవచ్చు అన్నారు. సరైన ప్రాంతంలో ఏర్పాటుచేసుకోవడం వల్ల భూగర్బజలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. నీటి వృథాను అరికట్టవచ్చన్నారు. అలాగే పెద్దకుడాల జడ్పీ హైస్కూల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలను సంరక్షించే విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలో కూఆ పచ్చదనం పెంపొందేందుకు మొక్కలు విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఏపీడీ సుబ్బారెడ్డి, ఏపీఓ గంగరాజు, ఈసీ భాస్కర్‌, టీఏలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 12:32 AM