ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూ భూ బాధితులకు న్యాయం చేయండి

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:41 PM

మదనపల్లె రెవెన్యూ భూ బాధితులకు న్యాయం చేయా లని గురువారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ను సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఈశ్వరయ్యలు కోరా రు.

రెవెన్యూ మంత్రిని కలిసిన సీపీఐ నాయకులు

మదనపల్లె అర్బన, ఆగస్టు 29: మదనపల్లె రెవెన్యూ భూ బాధితులకు న్యాయం చేయా లని గురువారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ను సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఈశ్వరయ్యలు కోరా రు. ఈసందర్భంగా గురువా రం వారు విజయవాడలో రెవె న్యూ మంత్రిని కలిసి ఫ్రీహోల్డ్‌ తర్వాత 22ఏ లో జరిగిన వాటిని రద్దు చేయాలని కోరారు. గత ప్రభు త్వ హయాంలో జరిగిన భూ దందాలు బయటకు వస్తాయనే నెపంతో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పైళ్లు దహనం చేశారని వారిపై చర్యలు తీసుకుని పేదల భూములను వారికే కేటాయించేలా చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనలో ఉన్న ఏ ఒక్కరినీ ఇంత వరకు అరెస్టు చేయాలేదని వాపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల భూములను బలవంతంగా, దౌర్జన్యంగా లాక్కోవడమే కాకుండా ప్రభుత్వ భూములు, చుక్కల భూములను, దేవాదాయ శాఖ భూములను, చెరువులు, కుంటలు వాగులు, వంకలు, ఇనాం భూములు, వంక పరంబోకు భూములు ఫ్రీహోల్డ్‌ చేయించి రిజిసే్ట్రషన చేసుకున్నారని ఆరోపించారు. 22ఏలో జరిగిన అవకతవకలు బయట పడుతాయనే ప్రభుత్వం మారిన వెంటనే పేదల రికార్డులను బూడిద చేశారన్నారు. ఈ సంఘటన అనంతరం రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిషోడియాకు ఒక్క రోజులోనే 689 రైతులు తమ సమస్యలను అర్జీ రూపంలో అందించారన్నారు. వైసీపీ వారు చేసిన అరాచకాలకు బయపడి నోరు మెదపని రైతులు చాలా మంది ఉన్నారన్నారు. భూములను కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకత్వంతోపాటు మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:41 PM

Advertising
Advertising