ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యుడికి సత్కారం
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:38 PM
రోడ్డు ప్రమాదంలో గాయపడి స్పృహకోల్పోయిన వ్యక్తిని కాపాడిన బి.కొత్తకోట ప్రభుత్వ ఆసు పత్రి వెద్యుడు డాక్టర్ వెంకట్రామ య్యను స్థానికులు, బాస్ ప్రతినిధు లు ఘనంగా సన్మానించారు.
బి.కొత్తకోట, డిసెంబరు 26(ఆంధ్ర జ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి స్పృహకోల్పోయిన వ్యక్తిని కాపాడిన బి.కొత్తకోట ప్రభుత్వ ఆసు పత్రి వెద్యుడు డాక్టర్ వెంకట్రామ య్యను స్థానికులు, బాస్ ప్రతినిధు లు ఘనంగా సన్మానించారు. ఈ నె ల 24న ములకలచెరువు మండల సరిహద్దు శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని చీకటిమానిపల్లె వద్ద లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో అనిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడిగా, అదే సమయంలో అటుగా వస్తున్న డాక్టర్ వెంకట్రామయ్య సీపీఆర్ చేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అనిల్ ఊపిరి తీసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. వెంకట్రామయ్య కృషితో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో పలువురు పట్టణ ప్రముఖులు ఆసుపత్రి సిబ్బంది కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ మెడికల్ ఆఫీసర్ డా.కిరణ్ సమక్షంలో వెంకట్రామయ్యను పూలమాలలు, దుశ్శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో సచి న, నక్కామహేష్, మాధవ, గంగాద్రి, జనార్ధన, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:38 PM