సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:45 PM
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
ప్రజల మధ్య పండుగలా వంద రోజుల పాలన
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
సంబేపల్లె, సెప్టెంబరు 21: రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం సంబేపల్లె మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో డీపీవో ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల మధ్య పండుగలా వంద రోజుల పాలన జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ ఒకేసారి వేయి రూపాయలు పెంచిన ఘనత ఈ ప్రభుత్వందే అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,437 టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని తెలిపారు. పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. విజయవాడను వరద ముంచెత్తిన సమయంలో 74 సంవత్సరాల వయస్సు గల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 12 రోజుల పాటు బస్సులోనే ఉండి వరద బాధితులకు భోజనం, నీళ్లు మాత్రలు వంటి వసతులు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది రైతులు ఉరి వేసుకునే విధంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి ఐదు నుంచి పది లక్షల వరకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయచోటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకు ప్రజలందరూ సహకరించి ముందుకు రావాలన్నారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగస్వామి, హౌసింగ్ పీడీ శివయ్య, డీఆర్‌డీఏ పీడీసత్యనారాయణ, ఎంపీడీవో సునీల్‌కుమార్, తహసీల్దార్ వెంకటేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, దుద్యాల సర్పంచ్ ఎద్దుల లక్ష్మిదేవి, ఎంపీటీసీ రామరాజు, మాజీ సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, గోపాల్, టీడీపీ నాయకులు దుద్యాల రమేశ్‌రెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ మల్లు విష్ణువర్థన్‌రెడ్డి, రంగారెడ్డి, దుద్యాల విష్ణువర్థన్‌రెడ్డి, గుట్టపల్లి వేణుగోపాల్‌నాయుడు, మండిపల్లి సిద్దారెడ్డి, సుబ్బరాజుయాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 11:45 PM