పచ్చదనం.. పర్యావరణానికి వరం
ABN, Publish Date - Aug 30 , 2024 | 11:34 PM
సమాజంలో పచ్చదనం పర్యావరణానికి వరంలాంటిదనం వక్తలు పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, ఆగస్టు 30: సమాజంలో పచ్చదనం పర్యావరణానికి వరంలాంటిదనం వక్తలు పేర్కొన్నారు. మానవులు పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ఫారెస్ట్ రేంజి అధికారి మదనమోహనరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనమహో త్సవంలో భాగంగా స్థానిక పుంగనూరు రోడ్డులోని నగరవనంలో ప్రభు త్వ అధికారులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్‌వో మాట్లాడుతూ అడవులు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మొక్కలు పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అంతే కాకుండా మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పట్టణంలో మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ ఖాజాభీ, ఎంపీడీవో భానుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే మొక్కలు పెంచడం అలవాటు చేసుకో వాలన్నారు. అనంతరం పలు రకాల మొక్కలను నాటారు. కార్యక్రమం లో డీఆర్‌వో మదనమోహన, సెక్షన ఆఫీసర్లు, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.
పీలేరులో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్స వం కార్యక్రమాన్ని శుక్రవారం పీలేరు మండలంలో పండుగ వాతావ రణంలో నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఫారెస్టు శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభు త్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో విరివిగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ పీలేరు ఫారెస్టు అధికారి రామ్లా నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా వాటిని సంరక్షించాలన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి, ఎంఈవోలు లోకేశ్వర రెడ్డి, పద్మావతి, ఎఫ్‌ఎస్‌వో సబిహా సుల్తానా, ఏపీవో మహేశ్వర, జడ్పీ కో-ఆప్షన సభ్యుడు షామియాన షఫీ, టీడీపీ నాయకులు కోటపల్లె బాబు రెడ్డి, కోటపల్లె శ్రీనాథరెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, గుర్రం నరేశ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఫారెస్టు సిబ్బంది రెడ్డి ఆశాబీ, జగదీశ, చంద్రకళ, ఉపాధి సిబ్బంది ప్రసాద్ బాబు, రియాజ్, శ్రీరాములు, గోపీ పాల్గొన్నారు.
ములకలచెరువులో: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఎంపీడీవో పోలప్ప సూచించారు. మండలంలోని అంబే డ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ మోహనప్రతాప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో: వనమహోత్సవంలో భాగంగా మండలంలో ని టి.సదుం పంచాయతీ రేకలగుంటి వద్ద రోడ్డుకు ఇరు వైపులా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఉపాధిహామీ ఏపీవో తిరుపాల్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామాపురం వెంకటరెడ్డి, టి.సదుం వెంకటప్ప, చింతమాను సుబ్బరాయప్ప, రేకల గుంటిపల్లె రాజారెడ్డి, వెంకటరమ ణ, శ్రీనివాస్, యహోనా, శీన, బాబు, రవి, ఈరప్ప పాల్గొన్నారు.
కురబలకోటలో: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఏపీవో వెంకటేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని తెట్టు పంచాయతీ లో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఏ పుష్ప, ఎఫ్‌ఏ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా శుక్రవారం మండల వ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని గట్టు జడ్పీహైస్కూల్ ఆవరణలో ఎం పీడీవో శంకరయ్య, ఎంఈవో రెడ్డిశేఖర్, ఏపీవో మంజుల మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో హెచయం లలితకుమారి, పాఠశాలకమిటీ ఛైర్మన సుదాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సులోచన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: మండలంలోని కలిచెర్ల హైస్కూల్‌లో శుక్రవారం ఎఫ్‌ఈఎస్ సంస్థ ఆధ్వర్యంలో వనమహోత్సవం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో 10 మొక్కలను తెచ్చి నాటి వనమహోత్సవాన్ని ప్రారం భించారు. దశల వారిగా అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్ర మం చేపడతామన్నారు. ఎంపీడీవో శ్రీధర్‌రావు, పాఠశాల హెచఎం రామచంద్ర ఎఫ్‌ఈఎస్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 11:34 PM