ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Tension.. పులివెందుల నియోజక వర్గంలో దారుణం..

ABN, Publish Date - Sep 30 , 2024 | 09:39 AM

ఇంట్లో వీఆర్ఏ నర్సింహులు నిద్రిస్తున్న సమయంలో అతని మంచం దగ్గర డిటోనేటర్లుపేల్చి ప్రత్యర్ధులు హతమార్చారు. పేలుడు ఘటనలో ఇల్లు ధ్వంసం అయింది. వీఆర్ఏ నరసింహులు అక్కడ కక్కడే మృతి చెందారు. పేలుడు సమయంలో అదే ఇంట్లో వేరేగదిలో నిద్రిస్తున్న మృతుని భార్య సుబ్బలక్షుమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి.

కడప జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో (Pulivendula Constituency) దారుణం చోటు చేసుకుంది. ఓ వీఆర్ఏ (VRA) ఇంటిని దుండగులు డిటోనేటర్లతో (Detonators)పేల్చివేశారు. వేముల మండలం, కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వీఆర్ఏ నర్సింహులు (VRA Narasimhulu) మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పేలుడు శబ్ధంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారిస్తున్నారు. కొత్తపల్లి గ్రామం ఫ్యాక్షన్ విలేజి కావడంతో నర్సింహులుకు పాత గొడవలు ఉన్నాయా, ప్రత్యర్థులు ఉన్నారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నర్సింహులుకు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఊరిలోవారు కాదని బయట నుంచి వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.


కాగా ఇంట్లో వీఆర్ఏ నర్సింహులు నిద్రిస్తున్న సమయంలో అతని మంచం దగ్గర డిటోనేటర్లుపేల్చి ప్రత్యర్ధులు హతమార్చారు. పేలుడు ఘటనలో ఇల్లు ధ్వంసం అయింది. వీఆర్ఏ నరసింహులు అక్కడ కక్కడే మృతి చెందారు. పేలుడు సమయంలో అదే ఇంట్లో వేరేగదిలో నిద్రిస్తున్న మృతుని భార్య సుబ్బలక్షుమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హతుడు భార్య తరుపున వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సింహులు హత్యకు భార్య అక్రమ సంబంధం కారణమని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచా రిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు

అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం

నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!

బాబోయ్.. 100కిపై మొసళ్లను చంపేసిన రైతు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 30 , 2024 | 09:39 AM