ఇది మంచి ప్రభుత్వం
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:41 PM
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే మంచి ప్రభుత్వమని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు.
కూటమి ప్రభుత్వంలో సమగ్రాభివృద్ధి
ఈ ప్రభుత్వంలో ప్రజలు హాయిగా జీవిస్తున్నారు
కడప ఎమ్మెల్యే మాధవి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి
పులివెందుల టీడీపీ ఇనచార్జ్ బీటెక్ రవి
సింహాద్రిపురం, సెప్టెంబరు 20: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే మంచి ప్రభుత్వమని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సింహాద్రిపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో బీటెక్ రవి పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం పోస్టర్‌ను బీటెక్ రవి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే తమ ప్రభుత్వం ఎన్నో రెట్లు మేలన్నారు. పింఛనదారులకు వెయ్యి రూపాయలు పెంచడానికి వైసీపీకి నాలుగు సంవత్సరాలు పట్టిందన్నారు. అదే తమ ప్రభుత్వంలో ఒకేసారి రూ.వెయ్యి పెంచడంతో పాటు ప్రభుత్వం మాట ఇచ్చినప్పటి నుంచి రూ.4వేలు పింఛను ఇచ్చిన ఘనత ఎక్కడా లేదన్నారు. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.భాగంగా టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఏమి చేసింది, భవిష్యత్తులో ఏమేమి హామీలు నెరవేర్చబోతోంది అనే విషయాలను మండల వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది ప్రజలకు వివరించాలన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.5లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మండల ప్రత్యేక అధికారి సన్నన్న, ఎంపీడీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ గురప్ప, టీడీపీ నేతలు జోగిరెడ్డి, రఘనాథరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమం - అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుంది
ఫ ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి
వేంపల్లె, సెప్టెంబరు 20: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి అన్నారు. టీ డీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేంపల్లె మండల పరిషత సభాభవనంలో ‘మా మంచి ప్రభుత్వం‘ గ్రామసభ నిర్వహించారు. మొదట ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేవంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4000 పింఛన, ఆకలి తీర్చే అన్న క్యాంటీన ఏర్పాటు చేశారని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దివిజ సంపతి, ఈఓఆర్డీ మల్లికార్జునరెడ్డి, ఈఓ సుబ్బారెడ్డి, మండలస్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో పాటు టీడీపీనేతలు డాక్టర్ సుబాబరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రమణ, ఏమిరెడ్డి కృష్ణారెడ్డి, పోతిరెడ్డి శివ, భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు: ఎమ్మెల్యే
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 20 : ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. శుక్రవారం కడప నగరం ఎర్రముక్కపల్లె కందిపాలెంలో మన మంచి ప్రభుత్వం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నిరంకుశపాలనతో ప్రజలు విసిగారని, ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో సంతోషంగా ఉన్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధనరెడ్డి, బి.హరిప్రసాద్, మున్సిపల్ కమిషనరు వైఓ నందన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 11:41 PM