ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జయహే మహిషాసురమర్దిని

ABN, Publish Date - Oct 11 , 2024 | 12:11 AM

దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

కడప (కల్చరల్‌), అక్టోబరు 10: దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఇంటిల్లిపాది ఆ తల్లిసేవలో తరించారు. కడప విజయదుర్గాదేవి ఆలయంలో 8వ రోజైన గురువారం అమ్మవారు మహాగౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి తెల్లవారుజామున 4.30గంటలకు 72 విశేష కలశాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించి షోడపచారాలతో పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీ హోమం, శ్రీచక్రార్చనలు నిర్వహించారు. సాయంత్రం 4.00 గంటలకు 18 రకాల పుష్పాలతో పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటలకు మహాగౌరీదేవిగా అమ్మవారు పూజలు అందుకున్నారు. అ మ్మవారికి మహామంగ ళహారతులు, ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. రాత్రి 8.00 గంటలకు విజయదుర్గామల్లిఖార్జునుల ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు సుధామల్లిఖార్జునరావు, నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Updated Date - Oct 11 , 2024 | 12:11 AM