విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకుందాం
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:07 AM
విశాఖ ఉక్కు పరిశ్ర మను పరిరక్షించుకుంద్దాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏఐటీయూ సీ, వ్యవసాయ కార్మిక సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబ రు 10: విశాఖ ఉక్కు పరిశ్ర మను పరిరక్షించుకుంద్దాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏఐటీయూ సీ, వ్యవసాయ కార్మిక సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నీరు గట్టువారిపల్లె వ్యవసాయ మా ర్కెట్ వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు తోపు కృష్ణప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించలనే ఉద్ధేశ్యం మానుకోవాలని హితవు పలి కారు. ఆంధ్రాలో ఉన్న ఓకేఒక భారీ పరిశ్రమ అని వెయ్యి రోజులపైగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మదనపల్లెలో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమం చేపట్టామ న్నారు. విశాక ఉక్కు పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమల, ముభారక్, నాయకులు రెడ్డెప్ప, వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్ చంద్రశేఖర్, మెకానిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేయ త్నాన్ని విరమించుకోవాలని సీపీఐ నాయ కులు డిమాండ్ చేశారు. ఆమేరకు విశా ఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకో వాలంటూ బి.కొత్తకోట జ్యోతి చౌక్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు .ఈ సంద ర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నర సింహులు, తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డిలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకంగా గనులు ఏర్పాటు చేయాలని, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, లేని పక్షంలో విద్యార్థి యువజన, కార్మిక సంఘాలతో ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు బషీర్‌ఖాన. రఘునాథ్, అష్రఫ్‌అలీ, తంబయ్యశెట్టి, జవహర్‌బాబు, గంగాధర్, బాబు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 11 , 2024 | 12:07 AM