ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా నాగేశ్వరుని ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ

ABN, Publish Date - Aug 30 , 2024 | 12:07 AM

చెన్నూరులోని లలితాంబికా సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది.

నాగేశ్వరాలయంలో శిఖర ప్రతిష్ఠ చేస్తున్న దృశ్యం

చెన్నూరు, ఆగస్టు 29 : చెన్నూరులోని లలితాంబికా సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. మండల వ్యాప్తంగా ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం యంత్రప్రతిష్ఠ, ధ్వజప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. పూర్ణాహుతి గావించారు. ఈ సంసదర్భంగా శివపార్వతుల ఉత్సవ మూర్తులకు వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ విస్తీర్ణత తక్కువ అయినా మహిళలు ఆలయం వెలుపల ఇబ్బందికరంగా కూర్చుని కళ్యాణం వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.

పెద్దఎత్తున పోలీసు బందోబస్తు

ట్రంకురోడ్డులోని నాగేశ్వరాలయం ఎదురుగా మసీదు ఉండడంతో బుధవారం నాటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం రాజు నేతృత్వంలో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప నుంచి వచ్చిన ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు.ఆలయం చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆలయం వద్ద అత్యధిక సంఖ్యలో స్థానిక నేతలు, యువత ఉన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:07 AM

Advertising
Advertising