Sugavasi టీడీపీ ఓటమికి మేడా కుటుంబమే కారణం

ABN, Publish Date - Sep 25 , 2024 | 10:42 PM

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.

Sugavasi టీడీపీ ఓటమికి మేడా కుటుంబమే కారణం
మాట్లాడుతున్న సుగవాసి బాలసుబ్రమణ్యం

నందలూరు, సెప్టెంబరు 25: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు. బుధవారం నూకినేనిపల్లె గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ తెలుగుదేశంపార్టీకి మేడా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడా విజయశేఖర్‌రెడ్డి సుండుపల్లె మండలంలో వైసీపీకి ఏజెంట్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. మేడా కుటుంబం టీడీపీకి ఘోరమైన మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస ల అధినేత వెంకటరమణ, జిల్లా లీగల్‌సెల్‌ లక్ష్మీనారాయణ, రాజంపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎద్దుల విజయసాగర్‌, బీసీ నాయకుడు తాటి సుబ్బరాయుడు, ఎస్సీ నాయకుడు మోడపోతుల రాము, మాజీ సర్పంచ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 10:42 PM