ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దారి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:51 PM

మదనపల్లె మండలం చిప్పిలి గ్రామంలో పదేళ్లుగా ఉన్న దా రి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే షాజహానబాషా చొరవ తీసుకున్నారు.

చిప్పిలిలో దారిసమస్యపై అధికారులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె మండలం చిప్పిలి గ్రామంలో పదేళ్లుగా ఉన్న దా రి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే షాజహానబాషా చొరవ తీసుకున్నారు. మంగళవారం చిప్పిలి గ్రామం బంగా రుకొత్తపేటకు చెందిన ప్రజలు తమ కాలనీకి దారి సమస్యపై ఎమ్మెల్యేను కల సి సమస్య విన్నవించారు. ఓ వ్యక్తి డీకేటీ భూమిలో ఇంటి నివాసం చేసు కోవడంతో అక్కడ కాలనీకి వెళ్లే దారి సమస్య వచ్చి నట్లు ప్రజలు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఈ విషయమై రెవెన్యూ అధికారులను పిలిపించి రెవెన్యూ రికార్డులు పరిశీలించి కాలనీ ప్రజలకు దారి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. కాలనీలో మురుగునీటి కాలువ నిర్మాణానికి ప్రతి పాదనలు పంపాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో ఆర్‌ఐ శేషాద్రిరావు, టీడీపీ నాయకులు గురునాథ్‌ యాదవ్‌, జంగాల రమణ, మధుసూధనరెడ్డి, డాన్సరెడ్డెప్ప, వినోద్‌, వాసు, వినోద్‌, నయాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:51 PM