ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి అర్జీదారుడి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలి

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:14 PM

రెవెన్యూ సిబ్బంది ప్రతి అర్జీదారుడి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని కడప ఆర్డీవో జాన ఇర్విన ఆదేశించారు.

వీఆర్వోతో మాట్లాడుతున్న కడప ఆర్డీవో జాన ఇర్విన

-రెవెన్యూ సిబ్బందితో ఆర్డీవో జాన ఇర్విన

వల్లూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ సిబ్బంది ప్రతి అర్జీదారుడి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని కడప ఆర్డీవో జాన ఇర్విన ఆదేశించారు. శనివారం వల్లూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ అర్జీదారుడి సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపించాలన్నారు. క్షేత్రస్థాయికి వెళితేనే ఆ సమస్య తెలుస్తుందన్నారు. అలాగే అర్జీలన్నీ ఆనలైనలో నమోదు చేయాలని సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో ఒక వ్యక్తిని కేటాయించి రెవె న్యూ డివిజన పరిధిలో ఉన్న అర్జీలన్నీ పరిష్కారం అవుతాయా లేదా అన్న అంశంపై నేరుగా ఆ లబ్ధిదారునికే ఫోను చేసి వివరాలు కనుక్కుంటామన్నారు. రైతులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దారు శ్రీవాణి, డిప్యూ టీ తహసీల్దారు, సర్వేయరు, రెవెన్యూ సిబ్బందితో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:15 PM