ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి

ABN, Publish Date - Dec 18 , 2024 | 11:49 PM

రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి కోరారు.

పులివెందుల రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలు వింటున్న ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

పులివెందుల రూరల్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి కోరారు.బుధవారం స్థానిక అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు గతం లో నానా అవస్థలు పడేవారన్నారు. ఏదైనా సమస్య పరిష్కరించాలని కోరుతూ అర్జీ ఇస్తే అది కలెక్టర్‌ నుంచి ఆర్డీఓకు, ఆర్డీఓ నుంచి తహసీల్దార్‌కు, తహసీల్దార్‌ నుంచి వీఆర్వోకు ఇలా బదలాయించి చేతులు దులుపుకొనే పరిస్థితి ఉండేదన్నారు. సమస్య పరిష్కారం కాక కోర్టులకు, పోలీ్‌సస్టేషనలకు, అధికార పార్టీవర్గాల వద్దకు వెళ్లి సమయాన్ని, డబ్బును వృథా చేసుకునే వారన్నారు. ఇలాంటి రైతుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించకుటే స్థానిక అధికారులే బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారన్నారు. కా వున అధికారులు సమస్యను సామరస్యంగా, విబేధాలు లేకుండా చూసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సదస్సులో 50శాతం మేర సమస్యలు పరిష్కారం అ వుతున్నాయన్నారు. మిగిలినవి ఉన్నతాధికారులు పరిష్కరిస్తారని రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాం లో రీసర్వే పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. దీనివల్ల ఆనలైనలో ఎవరిభూమి వారికి కనిపించకుండా పోయిందన్నారు. రీసర్వేను రద్దు చేశారని, రీసర్వే జరిగిన గ్రామాలలో 1బీ, అడంగల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గత రికార్డుల ప్రకారం సిబ్బందితో చర్చించి 1బీ, అడంగల్‌ ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరారు.

ధైర్యంగా ముందుకొస్తే ఏనాడో పరిష్కరించేవాళ్లం

పులివెందుల పట్టణంలోని న్యాక్‌బిల్డింగ్‌ సమీపంలో 2008లో భూసేకరణ కింద 48 మందికి చెందిన 91.58ఎకరాల డీకేటీ భూ మిని ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్సీకి పలువురు ప్రజలు వివరించారు. అయితే ఇంతవరకు తమకు నష్టపరిహారం ఇవ్వలేదని విన్నవించారు. ప్రస్తుతం తమ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు భవనాలు, ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా చట్ట ప్రకారం వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అలాగే విజయభాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్యాలయం వెనుక 459/1లో 19సెంట్లు, 459/2లో 62సెంట్ల స్థలాన్ని 2019లో కొందరు ఆక్రమించుకున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు.

Updated Date - Dec 18 , 2024 | 11:49 PM