నవ్యాంధ్ర దార్శిక నేత చంద్రబాబు
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:47 PM
నవ్యాంధ్ర దార్శిక నేత చంద్రబాబు అని పలువురు నేతలు కొనియాడారు.
పులివెందుల టౌన, సెప్టెంబరు 1 : నవ్యాంధ్ర దార్శిక నేత చంద్రబాబు అని పలువురు నేతలు కొనియాడారు. నారా చంద్రబాబునాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నేటికి 29 సంవత్పరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా పట్టణంలోని టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆదివారం ఉదయం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన తూగుట్ల మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని టీడీపీ కార్యకర్తలు గాంధీ సర్కిల్‌లో చంద్రబాబునాయుడి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 1995 సెప్టెంబరు 1న తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. నేటితో 29 ఏళ్లు పూర్తియి 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టారన్నారు. 28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరో పది సంవత్సరాలు పాటు ఆయన సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు.
సీఎం చంద్రబాబు శ్వాస, ధ్యాస రాషా్ట్రభివృద్ధే
చెన్నూరు, సెప్టెంబరు 1: సీఎం చంద్రబాబు శ్వాస, ధ్యాస రాషా్ట్రభివృద్ధేనని టీడీపీ మండల నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి నేత రాష్టా్ట్రనికి ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమ ని, అలాంటి నేత నిత్యం ఆయురారోగ్యాలతో ప్రజా శ్రేయస్సు కో సం పనిచేస్తుండాలని ఆకాంక్షించారు. తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 29 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా టీడీపీ చెన్నూరు కార్యాలయంలో మండల కన్వీనరు విజయభాస్కరరెడ్డి, పాలగిరి పెద్దసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మండల కన్వీనరు విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాషా్ట్రనికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అమరావతి, పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారని, రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతుందని భావించి కేంద్రాన్ని ఒప్పించి నిధులు సాధించారన్నారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామికవాడకు రూ.వేల కోట్లు కేటాయించి అక్కడ యువతకు ఉపాధి కల్పించబోతున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. మైనార్టీ నేత షబ్బీర్‌హుసేన, బీసీ సంఘం నేతలు జి.శ్రీనివాసులు, ఆటోబాబు, కుందేటి క్రిష్ణయ్య, తెలుగు యువత జిల్లా కార్యదర్శి పవనకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుల చలపతి, బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల సు బ్రమణ్యం, ఐటీడీపీ మణికంఠ, జిల్లా రైతు విభాగం నేతలు సుధాకర్‌రెడ్డి, అల్లాడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుది అవిశ్రాంత పోరాటం
సింహాద్రిపురం, సెప్టెంబరు 1: రాజకీయ రంగంలో అవిశ్రాంత పోరాటం, అలుపెరగని నైజం సీఎం చంద్రబాబుదేనని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) సతీమణి లతారెడ్డి పేర్కొన్నారు. 1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయు డు ప్రమాణస్వీకారం చేసి నేటితో 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆదివారం సింహాద్రిపురంలో మారెడ్డి లతారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీధర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, పీజీ రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.
నిరాశ్రయులకు అన్నదానం
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 1: టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 29 ఏళ్లు పూర్తయి 30వ ఏట ప్రవేశించడంలో భాగంగా కడప నగరం జడ్పీ ఆవరణంలో గల ప్రేమాలయ వృద్ధుల వసతిగృహంలో టీడీపీ కడప నగర అధ్యక్షుడు సానపరెడ్డి శివకొండారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి నిరాశ్రయుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రిగా చేసిన సేవలు ప్రజలందరూ గుర్తుంచుకున్నారన్నారు. వాణిజ్యవిభాగం నగర అధ్యక్షుడు సానపరెడ్డి రవిశంకర్‌రెడ్డి, సభ్యులు జియావుద్దీన, శ్రీను, కొండా సుబ్బయ్య, పలువురు పాల్గొన్నారు.
హబీబుల్లా వీధిలో...
కడప (నాగరాజుపేట), సెప్టెంబరు 1 : కడప నగరం హబీబుల్లావీధిలో అల్లాబకాష్ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీడీపీ నాయకుడు రవిశంకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు లయన పఠాన ఖాదర్‌బాషా, అమానుల్లా షేక్ మాట్లాడారు.
దేశం గర్వించదగ్గ నేత చంద్రబాబు
కడప రూరల్, సెప్టెంబర్ 1 : దేశం గర్వించదగ్గ నేత సీఎం చంద్రబాబునాయుడు అని టీడీపీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ లీగల్‌సెల్ కార్యాలయంలో ఆదివారం న్యాయవాదులతో కలిసి కేక్‌ను కట్‌చేసి అనందాన్ని పంచుకున్నారు.
Updated Date - Sep 01 , 2024 | 11:47 PM