ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాలిటెక్నిక్‌ కాలేజీకి నూతన భవనాలు నిర్మించాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:41 PM

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ శిఽథి లావస్థలో వుందని నూతన భవనాలు మంజూరు చేయిం చి నిర్మించాలని పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జింకాఅశోక్‌బాబు తదితరులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కోరారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసి పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తదితరులు లెక్చరర్లు వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యేకి విన్నవించిన కాలేజీ ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 10 : ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ శిఽథి లావస్థలో వుందని నూతన భవనాలు మంజూరు చేయిం చి నిర్మించాలని పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జింకాఅశోక్‌బాబు తదితరులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కోరారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసి పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తదితరులు లెక్చరర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ 1959లో నిర్మించిన పాలిటెక్నిక్‌ కాలేజీ పూర్తి శిథిలావస్థకు చేరిందన్నారు. ప్రస్తుతం 1800 వందల మంది విద్యార్థులు కాలేజీలో చదువుతున్నారన్నారు. హాస్టల్‌ భవనాలు, భోదనతరగతి గదులు, ల్యాబులు, వర్క్‌షాపుల గదులు అన్నీ శిఽథిలావస్థలో వున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాలేజీకి నిధులు మంజూరయి కాంట్రాక్టరు పనులు చేయక ఆ పనులు రద్దయి పోయాయన్నారు. తిరిగి కాలేజీ నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించి నిర్మాణా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ కలిసి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో లెక్చరర్లు వీరభద్రారెడ్డి, మంజునాఽథ్‌, శ్రావణ్‌కుమార్‌, సురేశ్‌బాబు, నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:41 PM

Advertising
Advertising