ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలి

ABN, Publish Date - Dec 29 , 2024 | 11:32 PM

సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గనాలని డాక్టర్‌ గునిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ గునిశెట్టి శ్రీనివాసులు

కడప ఎడ్యుకేషన, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గనాలని డాక్టర్‌ గునిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం కడప నగరం పద్మశాలి భవనలో పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం అధ్యక్షులు డాక్టర్‌ గునిశెట్టి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు కృషిచేయాలన్నారు. పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోము జ్ఞానశంకర్‌ హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చుప్పల విజయకుమార్‌ నూతన సభ్యులను పరిచయం చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సామా బాలసుబ్రమణ్యం, డాక్టర్‌ సామా సుధ దంపతులు, డాక్టర్‌ అవ్వారు అరుణ్‌ డైరీని ఆవిష్కరించారు. డాక్టర్‌ మామిళ్ల మల్లికార్జున, డాక్టర్‌ మామిళ్ల సునీల్‌కుమార్‌ చేతులమీదుగా క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు, వద్ది మాధవ, హెడ్మాస్టర్‌ విజయలక్ష్మి, ఇంజనీర్‌ సాధు శివ, వద్ది చైతన్య, రిటైర్డ్‌ డైట్‌ లెక్చరర్‌ కృష్ణయ్య, తిరుమల కొండు, విజయకుమార్‌తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:32 PM