ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:32 PM
సమస్యలతో పోలీసుస్టేషనకు వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలని ఎస్పీ హర్సవర్ధనరాజు సూ చించారు.
ఎస్పీ హర్షవర్ధనరాజు
కమలాపురం రూరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : సమస్యలతో పోలీసుస్టేషనకు వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలని ఎస్పీ హర్సవర్ధనరాజు సూ చించారు. మంగళవారం సామాజిక తనిఖీలో భాగంగా కమలాపురం పోలీసుస్టేషనను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి సేవించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. కమలాపురంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి 12 ప్రాంతాలను గుర్తించి ఎనిమిది ప్రాంతాల్లో శుభ్రపరిచారని, మిగలిన వాటిని కూడా తమ సిబ్బంది శుభ్రం చేస్తారన్నారు.
Updated Date - Oct 15 , 2024 | 11:33 PM