ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసులకు జ్యుడీషియల్‌ అధికారాలొద్దు

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:10 PM

పోలీసులకు జ్యుడీషియల్‌ అధికారాలతో పౌరహక్కులకు ప్రమాదం ఏర్పడుతుందని సామాన్యులకు న్యాయం అందదని ప్రముఖ న్యాయవాది సీవీ సురేష్‌ అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతన క్రిమినల్‌ చట్టాలు, ప్రజా హక్కులకు విఘాతాలు అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌సమావేశం జరిగింది.

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో న్యాయవాదులు, ప్రజా సంఘాలనేతలు

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 1 : పోలీసులకు జ్యుడీషియల్‌ అధికారాలతో పౌరహక్కులకు ప్రమాదం ఏర్పడుతుందని సామాన్యులకు న్యాయం అందదని ప్రముఖ న్యాయవాది సీవీ సురేష్‌ అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతన క్రిమినల్‌ చట్టాలు, ప్రజా హక్కులకు విఘాతాలు అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యువ న్యాయవాది వడ్ల హరిత అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ బిట్రీష్‌ ప్రభుత్వం రూపొందించిన క్రిమినల్‌ చట్టాలను నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చిందన్నారు. కథారచయిత న్యాయవాది దాదాహయాత్‌ మాట్లాడుతూ కొత్త చట్టాలలో 85 శాతం పాతవే తిరగరాశారన్నారు. మరో 15 శాతం చట్టాలు వలస పాలకుల కంటే క్రూరంగా మార్చారన్నారు. మరో సీనియర్‌ న్యాయవాది ముడిమెల కొండారెడ్డి మాట్లాడుతూ కొత్త చట్టాలు ప్రభుత్వాలకు పరపతి గల వారికి అనుకూలంగా వున్నాయన్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులే కాకుండా సామాజిక సృహ వున్న ప్రతి ఒక్కరూ ఈ చట్టాలను అవగాహన చేసుకుని వ్యతిరేకించాలన్నారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శి సత్యం, కాంగ్రెస్‌ ప్రతినిధి జిలాన్‌బాషా, దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లయ్య ,రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ మహమూద్‌ , సీఎంఎస్‌ పద్మ, మహిళా శక్తి లక్ష్మీదేవి, ఎన్‌ఎస్‌ ఖలందర్‌, రవీంద్ర ,డేవిడ్‌, ఎస్‌టీయూ రషీద్‌, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి మురళీప్రసాద్‌,ఐద్వా ముంతాజ్‌, పల్లవోలు రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 11:10 PM

Advertising
Advertising