ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేశ వ్యాప్తంగా రాజురాణి బొమ్మలకు ఆదరణ

ABN, Publish Date - Sep 30 , 2024 | 11:43 PM

దేశ వ్యాప్తంగా రైల్వేకోడూరు మండలం లక్ష్మీగారిపల్లెలో తయారు అవుతున్న రాజురాణి బొమ్మలకు విశేష ఆదరణ ఉందని తిరుమల లేపాక్షి మేనేజర్‌ వెంకటేశం తెలిపారు.

రాజురాణి బొమ్మలను పరిశీలిస్తున్న లేపాక్షి అధికారులు

తిరుమల లేపాక్షి మేనేజర్‌ బీపీ వెంకటేశం

రైల్వేకోడూరు, సెప్టెంబరు 30: దేశ వ్యాప్తంగా రైల్వేకోడూరు మండలం లక్ష్మీగారిపల్లెలో తయారు అవుతున్న రాజురాణి బొమ్మలకు విశేష ఆదరణ ఉందని తిరుమల లేపాక్షి మేనేజర్‌ వెంకటేశం తెలిపారు. లక్ష్మీగారిపల్లెలో ఈ ఏడాది జూలైలో రాజురాణి బొమ్మలకు వివిధ రకాల దుస్తుల అలంకరణలపై మహిళలకు ఇస్తున్న ఉచిత శిక్షణా కార్యక్రమం సోమ వారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల హస్తకళా వస్తువులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించిందన్నారు. అందులో భాగంగా వివిధ రకాల హస్తకళలకు సంబంధించి కళాకారులకు తగిన న్యూ డిజైన, కళల పట్ల పట్టు సాధించ డానికి ఏపీ హస్తకళల అభివవృద్ధి సంస్థ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సునీత, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎగ్జిక్యూ టీవ్‌ డైరెక్టర్‌ విశ్వ ఆదేశాల మేరకు అనేక శిక్షణా కార్యక్ర మాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ గారిపల్లెలో రాజురాణి బొమ్మలకు దేశంలోనే విశేష ఆద రణ ఉందన్నారు. ప్రధానంగా రాజురాణి బొమ్మలకు వివిధ రకాల దస్తుల అలంకరణ చేసే పద్ధతిని కొత్తగా తీసుకుని వచ్చామని తెలిపారు. వీటికి విపరీ తంగా గిరాకీ ఉందన్నారు. ప్రత్యేకంగా ప్రావీణ్యం కల్గిన ఒక మాస్టారును పెట్టి మొదటి విడతగా 20 మంది కళాకారులను ఎంపిక చేసి 2 నెలల పాటు శిక్షణ ఇచ్చారని తెలిపారు. కార్య క్రమంలో శిక్షకురాలు శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బి.నాగరాజు ప్రసాద్‌, శెట్టిగుంట సర్పంచ శివశైలజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 11:43 PM