రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు పరిష్కరించుకోండి

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:52 PM

మండలంలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న భూ బాధితులు సంబంధిత భూ పత్రాల తో రెవెన్యూ సదస్సులకు హాజరై వాటి ని పరిష్కరించుకోవాలని ఎంపీడీవో రమేష్‌ పేర్కొన్నారు.

రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు పరిష్కరించుకోండి
రెవెన్యూ సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

నిమ్మనపల్లి, ఆగస్టు 28: మండలంలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న భూ బాధితులు సంబంధిత భూ పత్రాల తో రెవెన్యూ సదస్సులకు హాజరై వాటి ని పరిష్కరించుకోవాలని ఎంపీడీవో రమేష్‌ పేర్కొన్నారు. బుధవారం స్థాని క ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ డీవోతో పాటురెవెస్యూ అధికారులు, స్థాని క పోలీసుల అధ్వర్యంలో భూ సమస్య లు కలిగిన వారితో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా తహసీల్దార్‌ ధనంజేయు లు మాట్లాడుతూ ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినప్పుడు, భూమిపై సంబం ధమే లేకుండా థర్డ్‌ పార్టీ అమ్మినప్నుడు, భూమికి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరులు విక్రయాలు చేసినప్పుడు రెవెన్యూ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. దీనికి కొండయ్యగారిపల్లి పంచాయతి వెంకోజిగారిపల్లి చెందిన కొందరు వ్యక్తులు హాజరై వారి సమస్యలను అధికారులకు తెలిపారు. భూ సమస్య జటిలం కావడంతో సమావేశాన్ని 15రోజులు తరువాత నిర్వహిస్తామని అధికారులు తెలి పారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాంప్రసాద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ నవయుగనాధ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:52 PM

Advertising
Advertising