ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాలువల్లో పూడికతీత పనులు

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:14 PM

పట్టణంలోని ప్రధాన మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత పనులను మొదలు పెట్టారు. సోమవారం మడూరు కాలువ చివరి పాయింట్‌ దగ్గర నుంచి మురుగు తొలగించే పనులను ఎక్స్‌కవేటర్‌ను కాలువలో దించి ట్రాక్టర్లకు పూడికను ఎత్తిపోశారు.

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 2 : పట్టణంలోని ప్రధాన మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత పనులను మొదలు పెట్టారు. సోమవారం మడూరు కాలువ చివరి పాయింట్‌ దగ్గర నుంచి మురుగు తొలగించే పనులను ఎక్స్‌కవేటర్‌ను కాలువలో దించి ట్రాక్టర్లకు పూడికను ఎత్తిపోశారు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘మురుగుతొలిగేనా’ కఽథనానికి స్పందించిన కమిషనర్‌ రఘునాథరెడ్డి కాంట్రాక్టర్లతో చర్చించి పనులు మొదలు పెట్టించారు. ఈ పనులను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్వయంగా వచ్చి పూడికతీత పనులను పరిశీలించారు. పూడిక తీతకు ముందు నీళ్ళు తొలగించి పూడిక ఎత్తివేయాలని ఆయన సూచించారు. పూడిక తీసేటప్పుడు మున్సిపల్‌ ఇంజనీర్లు పర్యవేక్షించాలన్నారు. బిల్లులు చేసేటప్పుడు కూడా పనులు పూర్తి స్థాయిలో జరిగి వుంటేనే చేయాలని ఆదేశించారు. ఈ పనులను మున్సిపల్‌ ఈఈ సాయిక్రిష్ణ ,డీఈ ప్రభాకర్‌ దాస్‌ తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - Sep 02 , 2024 | 11:14 PM

Advertising
Advertising