బస్సుల్లేక విద్యార్థుల పాట్లు
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:32 PM
గుర్రంకొండ పట్టణం నుంచి మదనపల్లె, అంగళ్లు, వాల్మీకీపురం పట్టణాల్లో పాఠశాలలు, కళాశాల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు సమయానికి సకాలంలో బస్సులు లేక పడరా నిపాట్లు పడుతున్నారు.
గుర్రంకొండ, సెప్టెంబరు 1: గుర్రంకొండ పట్టణం నుంచి మదనపల్లె, అంగళ్లు, వాల్మీకీపురం పట్టణాల్లో పాఠశాలలు, కళాశాల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు సమయానికి సకాలంలో బస్సులు లేక పడరా నిపాట్లు పడుతున్నారు. కళాశాలలకు వెళ్లడానికి గుర్రంకొండ బస్టాం డులో ఉదయం గంటల తరబడి బస్సుల కోసం నిలబడాల్సిన దయ నీయస్థితి నెలకొంది. ఉదయం బస్సుల కొరత అధికంగా ఉండడం తో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నార బస్సు సర్వీసులను పెంచాలని పలుమార్లు అధికారుల క వినవించుకున్న పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు వాపోతున్నారు. గుర్రంకొండ పట్టణం, గ్రామాలోని విద్యా ర్థిని, విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు వందలాది మంది మదనపల్లె, వాల్మీకీపురం, అంగళ్లు ప్రాం తాల్లోని వివిధ కాలేజీలకు వెళుతున్నారు. దీంతో ఉదయం 7.30 గంటలకే బస్టాండుకు చేరుకున్నా సకాలంలో బస్సుల్లేక సమయానికి పాఠశాల లు, కళాశాలలకు ప్రతిరోజూ వెళ్లలేకపోతున్నామన్నారు. ఉదయం పూట గంటల తరబడి నిలబడితేకానీ ఆర్టీసీ బస్సులు రావడం లేదు. ఒక వేళ ఒకటి, అర బస్సు వచ్చినా విద్యార్థులు నిలబడడానికి కూడా చోటు దొరకడం లేక పుట్‌బోర్డుపై వేలాడుతూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులలో విద్యార్థులు ఏదైనా ప్రమా దం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి విద్యార్థులకు ఇబ్బందులు కలుగుకుండా సమయానికి బస్సులు నడపాలని విద్యార్థు తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
బస్సుల కొరత వల్లే సమస్య వస్తోంది
విద్యార్థుల బస్సుల ఇక్కట్ల విషయమై మదనపల్లె ఆర్టీసీ డిపో-1 మేనేజర్ వెంకటరమణారెడ్డి వివరణ కోరగా మదనపల్లె-1, 2 ఆర్టీసీ డిపోలో ప్రస్తుతం బస్సుల కొరత ఉందన్నారు. దీంతో విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపలేకపోతున్నట్లు తెలిపారు. కొత్త బస్సు లు కావాలని జిల్లా అధికారులకు నివేదిక పంపామని కొత్త బస్సులు రాగానే అన్ని మార్గాల్లో బస్సులను నడిపి సమస్యలను పరిష్కారిస్తా మన్నారు.
Updated Date - Sep 01 , 2024 | 11:33 PM