విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ABN, Publish Date - Sep 12 , 2024 | 11:54 PM
విద్యార్థులు విద్యతో పాటు క్రీడాపోటీ ల్లో రాణించాలని మదనపల్లె ఎంఈవో రాజగోపాల్ పేర్కొన్నారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబరు12: విద్యార్థులు విద్యతో పాటు క్రీడాపోటీ ల్లో రాణించాలని మదనపల్లె ఎంఈవో రాజగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన ఆధ్వర్యంలో మదనపల్లె మండల స్కూల్ గేమ్స్ పోటీలు సీటీఎం జిల్లా పరిషత ఉన్నత పాఠశాలో గురువారం ప్రారం భమయ్యాయి. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, మదనపల్లెలో యోగా, చెస్, బాడ్మింటన పోటీలు అండర్-14, 17 బాల బాలికల విభాగంలో నిర్వహించి మదనపల్లె మండల జట్టును ఎంపిక చేశారు. వారు త్వర లో జరిగే నియోజకవర్గ స్కూల్ గేమ్స్ పోటీల్లో మండలం తరుపున పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సీటీఎం జడ్పీ స్కూల్ హెచఎం ఆం జనేయులు, మదనపల్లె జడ్పీ స్కూల్ హెచఎం సుబ్బారెడ్డిలు మాట్లాడు తూ క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉత్తేజం కలిగి జీవితంలో క్రమశిక్షణతో మెలిగి ఉంటారన్నారు. శుక్రవారం మదనపల్లె జిల్లా ఉన్నత పాఠశాలలో అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని మండల కో-ఆర్డినేటర్ శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిరిధర్‌నాయక్, నరేష్, దేవకమ్మ, సుధాకర్, లత, అంజనప్ప, యేసుఫ్, గురు, భాను, మహేష్‌లు పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: స్థానిక జడ్పీహైస్కూల్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. దాదాపు 6పాఠ శాలలకు సంబంధించిన అండర్-14, అండర్-17 విద్యార్థుఽలు క్రీడలలో పాల్గొని వారి సత్తాచాటారు. ఈ సందర్భంగా ఎంఈవో-2నారాయణ మాట్లాడుతూ క్రీడలతో మనస్సుకు ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. అనంతరం పలు క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చివరి రోజు బహుమతును పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్, బద్రి తదితరులు పాల్గిన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 11:54 PM