ఆలయ ప్రవేశ నిరాకరణపై చర్యలు తీసుకోండి
ABN, Publish Date - Sep 01 , 2024 | 12:04 AM
గ్రామ సమీపంలోని రామాలయంలోకి తాము ప్రవేశించరా దని కొంత మంది ఆంక్షలు పెడుతు న్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పీలేరు మండలం వేపులబైలు పంచా యతీ రెడ్డివారిపల్లె సమీపంలోని దళిత వాడ గ్రామస్థులు అధికారులను కోరా రు.
పీలేరు, ఆగస్టు 31: గ్రామ సమీపంలోని రామాలయంలోకి తాము ప్రవేశించరా దని కొంత మంది ఆంక్షలు పెడుతు న్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పీలేరు మండలం వేపులబైలు పంచా యతీ రెడ్డివారిపల్లె సమీపంలోని దళిత వాడ గ్రామస్థులు అధికారులను కోరా రు. దీంతో స్పందించిన అధికారులు 15 రోజుల్లోగా దళితులందరికీ ఆలయ ప్రవే శం కల్పించే విధంగా సామూహిక ఆల య ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని రెడ్డివారిపల్లె గ్రామస్థులను హెచ్చరించారు. రెడ్డి వారిపల్లె గ్రామంలో శనివారం తహసీల్దారు భీమేశ్వర రావు నేతృత్వంలో నేషనల్ సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రెడ్డివారిపల్లె సమీపంలోని దళితవాడ గ్రామస్థులు రెడ్డివారిపల్లెలోని రామాలయంలోకి తమను కొంత మంది రానివ్వ డం లేదని తహసీల్దారుకు తెలిపారు. దీంతో ఆయన అందుబాటులో ఉన్న కొంత మంది రెడ్డివారిపల్లె గ్రామస్థులను విచారించి ఆలయంలోకి అందరినీ రానివ్వాలని, వివక్షకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళితవాడల్లో శాశ్వత శ్మశాన వాటిక తోపాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెలుగు ఏపీ ఎం లక్ష్మణ్ రెడ్డి, ఏఎస్‌ఐ హేమసుందర్, ఏఈ ఎతిరాజులు, ఆర్‌ఐ చాణక్య, దళిత సంఘ నేతలు పాలకుంట శ్రీనివాసులు, తుమ్మల ధరణీ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 01 , 2024 | 12:04 AM