Teacher after parents : తల్లిదండ్రుల తర్వాత గురువే
ABN, Publish Date - Sep 05 , 2024 | 10:52 PM
తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు.
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
డాక్టర్ సర్వేపల్లిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి
ఉపాధ్యాయులు సమాజమార్గదర్శకులు
మానవత ఆధ్వర్యంలో భారీగా ఉపాధ్యాయులకు సన్మానం
ఎర్రగుంట్ల, సెప్టెంబరు 5: తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాద్, మానవత చైర్మన్ డి.రఘురామిరెడ్డి, ప్రతినిధులు మల్లికార్జునరెడ్డి, రంగయ్య, సతీష్‌కుమార్, గంగాధర్‌రెడ్డి, ఎస్వీరమణారెడ్డి, రాజవర్దన్ రెడ్డి, సుబ్బరాయుడు, రామ్మోహన్, శ్రీరాములు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాణి తిరుమలదేవి డిగ్రీ కళాశాలలో...
ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబరు 5: స్థానిక రాణి తిరుమలదేవి డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాలను నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి, కరస్పాండెంట్ తరుణ్ ఇంద్రశేఖర్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో....
ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అశోక్ పేర్కొన్నారు. స్టేట్‌బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యాయులను సత్కరించారు. ఏపీటీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటజనార్ధన్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఉపాధ్యాయులు బాలజోజప్ప, జహీర్ అబ్బాస్, చాంద్‌బాష, అల్లాబకాష్, చంద్రశేఖర్, పరమేశ్వర్, రెడ్డికిశోర్, హరిప్రసాద్, అరిగెల భాస్కర్, ఒంటెద్దు సుధాకర్‌రెడ్డి, షాబుద్దీన్, బీరభద్రుడు, లతను సన్మానించారు. బ్యాంకు ఉద్యోగులు మహేష్, శ్రీకాంత్, సాగర్, నగ్మ, శివప్రసాద్, సమంత, జయలక్ష్మి పాల్గొన్నారు.
ముద్దనూరులో....
ముద్దనూరు సెప్టెంబరు5: మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం చేసుకున్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రాజబాబు ఆధ్వర్యంలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాబు, పీడీ మాధవ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఐడీపీఎస్‌లో...
చాపాడు, సెప్టెంబరు 5: ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో టీచర్స్‌డే నిర్వహించారు. అధ్యాపకులను విద్యార్థులు సన్మానించారు. ఛైర్మన్ జయచంద్రారెడ్డి, డైరెక్టర్ లోహిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రవీంద్ర మాట్లాడారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ...
జమ్మలమడుగు, సెప్టెంబరు 5: టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం చేసుకున్నారు. స్థానిక జడ్పీ హైస్కూలులో హెడ్మాస్టర్ భాగ్యలక్ష్మిని ఘనంగా సన్మానించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు పాల్గొన్నారు.
మైలవరంలో..
మైలవరం, సెప్టెంబరు 5: ఉపాధ్యాయులు సమాజ దార్శనికులు అని ఎంపీడీఓ శంషాద్ భాను, మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి అన్నారు. మైలవరంలో ఉపాధ్యాయ దినోత్స వాన్ని అల్లె ప్రభానాగిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంఈఓలు రమణారెడ్డి, చిట్టిబాబును సన్మానించారు. విశ్రాంత ఎంఈ ఓలు వెంకటేశ్వర్లు, క్రిష్టఫర్, హెచ్‌ఎంలు ప్రభాకర్‌రెడ్డి, కొం డారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యా యులు, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది మురళి పాల్గొన్నారు.
బద్వేలులో....
బద్వేలుటౌన్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం సంద ర్భంగా రత్నం స్కూల్లో సర్వేపల్లె రాధాక్రిష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సత్కరిం చారు. కార్యక్రమంలో యోగాటీచర్ బీఎస్ నారాయణరెడ్డిని రత్నం స్కూలు కరెస్పాండెంట్ రత్నం, సుబ్బయ్య, ప్రసాద్, శిరీషశ్రీధర్, మల్లికార్జున, ఆంజనేయులు సత్కరించారు.
చెన్నకేశంపల్లె పాఠశాలలో...
బద్వేలు/బద్వేలు రూరల్, సెప్టెంబరు 5: చిన్నకేశంపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు పెంచలయ్య, స్టాఫ్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు టి.వి.సుబ్బారావు, సుబ్బరాయుడు, వరలక్ష్మి, గౌస్‌బాష, రామమోహన్, ఇందిర, నరేష్ పాల్గొన్నారు.
సృజన్ ఇంగ్లీషు మీడియం స్కూలు కార్యక్రమంలో ప్రసా ద్, ప్రధానోపాధ్యాయులు సుబ్బయ్య, కరస్పాండెంట్ పాలెం శ్రీనివాసులరెడ్డి, కేవీ సుబ్బారావు, బీసీ గురుమూర్తి, మాదన విజయకుమార్ పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 10:59 PM