ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:37 PM

రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అన్న క్యాంటీన్‌లో అన్నం వడ్డిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

అన్న క్యాంటిన్‌ ప్రారంభోత్సవంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 23: రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మంత్రి మండిపల్లి, కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు తెలిపారు. దినసరి కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి అనుగుణంగా రూ.5కే రుచికరమైన భోజనం పెట్టడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి క్యాంటీన్‌ వద్ద ఒక్కొక్క పూటకు 400 మంది చొప్పున రోజుకు 1200 మందికి టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రికి భోజనం ఉంటుందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు అనేవి ఉండవన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో అన్నక్యాంటీన్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు, 20వ వార్డు కౌన్సిలర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షుడు అనుంపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి మట్లి శ్రీనివాసులునాయుడు, రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గుర్రం సుబ్బయ్యనాయుడు, రాయచోటి పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌వలి, టీడీపీ నేతలు సుగవాసి విద్యాధర్‌, ఎద్దుల లక్ష్మిప్రసాద్‌, వెంకట్రమణారెడ్డి, సంజీవరెడ్డి, ఎజాజ్‌ఖాన్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:37 PM