పేదల సొంతింటి కలను నెరవర్చడమే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Sep 17 , 2024 | 11:42 PM
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు.
కడప(కలెక్టరేట్), సెప్టెంబరు 17: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. మంగళవారం భువనేశ్వర్ నుంచి పీఎంఏవై గ్రామీణ్, అర్బనకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 విధి విధానాలను భారత ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరేట్ ఎనఐసీ హాలు నుంచి కలెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా దేశంలోని గ్రామీణ, మున్సిపల్, అర్బన డెవలప్మెంట్ ప్రాంతాలలో 2023-24కు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేసుకున్న కోటి యాభై లక్షల ఇళ్లతో పాటు, ఆవాస్‌ప్లస్ 2024 యాప్‌ను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన తరువాత కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విడుదల చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 విధి విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండలన్నారు ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఒక ఆవాసం ఏర్పాటు చేయడం ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో ఇప్పటికే గృహాలు మంజూరైన వారందరూ త్వరగా ఇళ్లను పూర్తి చేసుకోవాలన్నారు. గృహనిర్మాణ శాఖ చిత్తశుద్ధితతో కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో మౌలికసదు పాయాలన్నింటిని కల్పించాలన్నారు. తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం గృహ లబ్ధిదారులకు మెగా తాళం చెవిని కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇనచార్జి కమిషనర్ నందన, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, డీఆర్డీఏపీడి ఆనంద్ నాయక్, మెప్మా పీడీ సురేష్ నాయక్, డ్వామా పీడీ జోయల్ విజయ్ కుమార్, గృహనిర్మాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 17 , 2024 | 11:43 PM