పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి లక్ష్యం
ABN, Publish Date - Sep 20 , 2024 | 12:06 AM
పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పులివెందుల నియెజకవర్గ టీడీపీ ఇనచార్జ్ రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, టీడీపీ ఇనచార్జ్ బీటెక్ రవి
పులివెందులలో ఘనంగా అన్న క్యాంటిన ప్రారంభం
పులివెందుల/పులివెందుల టౌన, సెప్టెంబరు 19 : పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పులివెందుల నియెజకవర్గ టీడీపీ ఇనచార్జ్ రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబునాయుడు పేదల కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే అన్న క్యాంటిన్లు అన్నారు. గురువారం పులివెందుల పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద అన్న క్యాంటినను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలితో బాధపడకూడదనే సంకల్పంతో టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామరావు రూ.2కే కిలో బియ్యం పథకం ప్రారంభించారన్నారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు అన్న క్యాంటిన ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 195 అన్న క్యాంటిన్లు కొనసాగించామని, అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చి న వైసీపీ వాటిని దుర్మార్గంగా తొలగించి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. ఐదేళ్ల పరిపాలనలో టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తొలగించి జగన పేర్లతో పథకాలు పెట్టుకున్నారన్నారు. అంతేకాకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ వారిపై కేసులు, దాడులు, దౌర్జన్యాలతో పాలించారన్నారు. త్వరలో మరొక అన్న క్యాంటిన ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. జగన అధికారంలో ఉండగా పులివెందుల ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రతి పథకాన్ని పులివెందుల ప్రజలకు అందించేలా కృషి చేస్తామన్నారు. అన్నక్యాంటిన పనులను రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదన రెడ్డి వేగవంతంగా చేయించారన్నారు. రూ.5కే నాణ్యమైన టిఫిక్, భోజనాలు అందించడం సంతోషమన్నారు. పేదలతో పాటు వివిధ పనుల నిమిత్తం పులివెందులకు వచ్చే వారికి అన్న క్యాంటిన్లు ఎంతగానో ఉపయోగన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, కార్మికులకు రూ.5కే ఆకలి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తూగట్ల మధుసూదనరెడ్డి, జోగిరెడ్డి, మహబూబ్‌బాషా, ప్రసాదరెడ్డి, పి.భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనరు రాముడు, సీఐ జీవనగంగానాధ్, బాబు, తూగుట్ల సిద్దారెడ్డి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 12:06 AM