ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్పొరేషనలో మేయర్‌కే సర్వాధికారాలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:57 PM

కార్పొరేషనలో మేయర్‌కే సర్వాధికారాలు ఉంటాయని మేయర్‌ సురేష్‌ బాబు స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న మేయర్‌ సురే్‌షబాబు

ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో మెంబర్‌ మాత్రమే

మెజార్టీ సభ్యుల తీర్మానం ఆమోదయోగ్యం

కడప ఎర్రముక్కపల్లె, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషనలో మేయర్‌కే సర్వాధికారాలు ఉంటాయని మేయర్‌ సురేష్‌ బాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కేవలం ఎక్స్‌అఫిషియో మెంబర్‌ మాత్రమేనని చెప్పారు. మెజార్టీ సభ్యుల తీర్మానం ఆమోదయోగ్యమన్నారు.సోమవారం కడప కార్పొరేషన మేయర్‌ చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వసభ్య స మావేశాన్ని ఎమ్మెల్యే మాధవీరెడ్డి రసాబాసగా మార్చేశారన్నారు. ప్రజా సమస్యలపై చర్చిచాలన్న ఇంగితజ్ఞాన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శాసనసభ్యులైన మాధవి, చైతన్యరెడ్డిలను ఎంతో గౌరవించామన్నారు. తాము మర్యాద ఇస్తే దాన్ని అగౌరపరిచే విధంగా ఎమ్మెల్యే మాధవి వ్యవహరించారన్నారు. సాటి టీడీపీ కార్పొరేటర్‌ను సైతం కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. తన ఇంటిపై చెత్తవేసి ప్రథమ పౌరుడైన తనను అవమానించారన్నారు. సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారన్నారు. ఈ ఏడు నెలల కాలంలో కార్పొరేషనకు ఒక కోటి నిధులు ఏమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. కనీసం స్కూల్‌ యూనిఫాం కూడా కుట్టించే గతి లే దన్నారు. తమ పార్టీ కార్పొరేటర్లను ప్రలోభాలు, భయబ్రాంతులకు గురిచేసి టీడీపీలోకి లాక్కున్నారన్నారు. సొంత నిధులతో ఆరు నెలల్లో రవీంద్రనగర్‌ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఇంత వరకు అతీగతీ లేదన్నారు. అజెండాపై చర్చ జరగకుండా అజెండానే చించి వేశారని ఆరోపించారు. వాళ్ల పార్టీ నగర అధ్యక్షుడిపైనే దాడి చేయించిన సం స్కృతి ఎమ్మెల్యే మాధవిదన్నారు. టీడీపీ కీలక నేతలే ఎమ్మెల్యే మాధవి దగ్గరికి వెళ్లడం లేదంటే ఆమె తీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. జనరల్‌ బాడీలో మెజార్టీ సభ్యుల తీర్మానం చేశారన్నారు. సభ్యుల తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం అంగీకరిస్తే ఫర్వాలేదు లేదంటే న్యాయపోరాటం చేసి సాధించుకుంటామన్నారు. కుర్చీ ప్రోటోకాల్‌ అంశం కానే కాదని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంతో ఆశించామన్నారు. అయితే ఎమ్మెల్యే తన పంతం నెగ్గించుకోవడానికి సమావేశాన్ని రసాబాస చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:57 PM