ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

్ఠమహాకనకదుర్గ.. విజయకనకదుర్గ

ABN, Publish Date - Oct 10 , 2024 | 11:35 PM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘మహాకనకదుర్గ..విజయకనకదుర్గ’గా అమ్మవారు భక్తుల కు దర్శనమిచ్చారు.

దుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు

మదనపల్లె అర్బన, అక్టోబరు10: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘మహాకనకదుర్గ..విజయకనకదుర్గ’గా అమ్మవారు భక్తుల కు దర్శనమిచ్చారు. ఇందులో బాగంగా గురువారం ఏడో రోజు స్థానిక కోర్టులో వెలసిన గంగమ్మతల్లి, నీరుగుట్టువారిపల్లెలో చౌడేశ్వరీదేవి మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. చౌడేశ్వరీ మాతను స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషా తన పార్టీ నాయకులతో కలిసి దర్శనం చేసుకున్నారు. దేవతా నగర్‌లోని రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు దుర్గామాతగా, దేవళం వీధిలోని సోమేశ్వర స్వామి ఆలయంలో బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. వాసవీ భవనంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయం లో అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో దర్శనమిచ్చా రు. అనపగుట్ట శ్రీవారి నగర్‌లోని అభయ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలోముత్యాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండల కేంద్రంలోని శివాలయంలో కొలువుదీరిన పార్వతీదేవి అమ్మవారు గురువారం దుర్గాదేవి అలం కారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన ఎం.కృష్ణమూ ర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కురబలకోటలో: దసరాశరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కన్యకా పరమేశ్వరీ అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

గుర్రంకొండలో:గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మ అమ్మ వారు గురువారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే గుర్రంకొండ పోలేరమ్మ ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా కరుణిం చారు.. కార్యక్రమంలో ఈవో మంజుల పాల్గొన్నారు.

కలకడలో:మండలంలోని కోన గ్రామంలో వెలసిన చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా గురువారం భక్తులను కరు ణించారు.

నిమ్మనపల్లిలో: దసరా నవరాత్రుల సందర్భంగా నిమ్మనపల్లి పంచా యతి పెద్దమాదిగపల్లి వెలసిన మాతమ్మతల్లి ఆలయంలో ఏడవరోజు దుర్గామాతాగా అమ్మవారు భక్తులకు దర్శనమించ్చారు. వచ్చిన భక్తులకు అన్నదానం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

వాల్మీకిపురంలో: మండలం వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గండబోయనపల్లె సత్య మ్మతల్లి ఆలయం, నల్లవీరగంగాభవాని ఆలయం, బజారువీధిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం, చింతపర్తి వాసవీ అమ్మవారి ఆల యం, గొల్లపల్లెలోని విరూపాక్షమ్మతల్లి గురువారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. కోనేటివీధి శివాలయం లో మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు.

కలికిరిలో: కలికిరి పట్టణంలోని కన్యకాపరమేశ్వరిదేవి గురువారం దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ దేవత ఎల్లమ్మను దుర్గాదేవి అలంకరణలో నిర్వాహకులు తీర్చిదిద్దారు.

Updated Date - Oct 10 , 2024 | 11:35 PM