ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లడ్డూ కల్తీ వెనకున్న వారిని శిక్షించాలి

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:31 PM

తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీకి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగు యువత నియో జకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్‌తేజ డిమాండ్‌ చేశారు.

మదనపల్లెలో వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి పసుపునీళ్లతో అభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 20: తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీకి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగు యువత నియో జకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్‌తేజ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్లుగా టీటీడీకి కేఎంఎఫ్‌కు చెందిన నందిని నెయ్యి సరఫరా చేస్తుంటే జగన ప్రభుత్వం వచ్చాక తమిళనాడు కాంట్రాక్టర్‌కు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ఆ కాంట్రాక్టర్‌ నెయ్యిలో జంతువుల కొవ్వును కల్తీ చేసి సరఫరా చేశాడన్నారు. జగన తీరు పరిశీలిస్తే తిరుమల లడ్డూను అపవిత్రం చేసేందుకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు మార్చారని ఆరోపించారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మనోభవాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టిన దుష్టులను కఠినంగా శిక్షించాలని టీడీపీ యువ నాయ కుడు కంచెర్ల చింటూ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక చిత్తూరు బస్టాండు సర్కిల్‌ వద్ద చింటూ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి పటానికి పసుపునీళ్లతో అభిషేకం చేసి, నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు, పంది కొవ్వు ను కలపడం దారుణమన్నారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాట కొండ మధుబాబు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను కించపరచిన వారిని ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్‌ మాజీ కౌన్సిలర్‌ సహజీవనబాబు, మాజీ సైనిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, సి. గంగాధరం, రెడ్డిసుబ్రమణ్యం, రెడ్డెప్పరావు, గగన, హరి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల లడ్డూలో కొవ్వు పదార్థాలు కలపడం దుర్మార్గం

కలికిరి, సెప్టెంబర్టు 20: కోట్లాది మంది భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా, భక్తి భావంతో స్వీకరించే తిరుమల వేంకటేశ్వర స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విశ్వ హిం దూ పరిషత్తు దక్షిణాంధ్ర రాష్ట్ర సామాజిక సమరసత ప్రముఖ్‌, కలికిరికి చెందిన చింతపర్తి మహేష్‌ ధ్వజమెత్తారు. పవిత్రమైన లడ్డూలో నాలు గేళ్లుగా జంతువుల కొవ్వును కలుపుతున్నారనే విషయం నిర్ధారణ కావడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు కేవలం ఒక్క తిరుమల లడ్డూ ప్రసాదంలో మాత్ర మే జరిగిందా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ ఆలయాల్లో అమలు చేసేందుకు కూడా వైసీపీ ప్రభు త్వం తెగించిందా అనే కోణంలో విచారణ జరిపించాలని మహేష్‌ డిమాం డ్‌ చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి చేత విచారణ చేయించి నిర్ధారిం చాల్సిందిగా ఆయన శుక్రవారం ఓ పత్రికా ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 20 , 2024 | 11:31 PM