ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిడ్డంగివారిపల్లె చెరువుకు కృష్ణాజలాల తరలింపు

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:47 PM

వేంపల్లె మండలంలో మారుమూల గ్రామాలైన గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె చెరువులకు కృష్ణాజలాలు పైప్‌లైన ద్వారాతరలించే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు.

వేంపల్లె, సెప్టెంబరు 20: వేంపల్లె మండలంలో మారుమూల గ్రామాలైన గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె చెరువులకు కృష్ణాజలాలు పైప్‌లైన ద్వారాతరలించే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. గిడ్డంగివారిపల్లెకు చెందిన టీడీపీనాయకులు మల్లంగి భాస్కర్‌రెడ్డి, వేంపల్లె పట్టణ అధ్యక్షులు ఆర్వీ రమే్‌షలు పులివెందుల టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవిని కలిసి రైతులకు నీటి సమస్య ఉందని, గిడ్డంగివారిపల్లె, బక్కన్న గారిపల్లె చెరువులకు కృష్ణాజలాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బీటెక్‌రవి ఇరిగేషన అధికారులకు ఫోన చేసిరైతుల ఇబ్బంది దృష్ట్యా నీటిని పంపించే కార్యక్రమం చేయాలని సూచించారు. ఇరిగేషన ఈఈ రాజశేఖర్‌రెడ్డి కిందిస్థాయి అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితో ఇరిగేషన, విద్యుత శాఖ అధికారులు టి.వెలమవారిపల్లె పంప్‌హౌస్‌ వద్ద మోటర్లను ఆనచేయించారు. పీబీసీ కాల్వ నుంచి కృష్ణాజలాలను పైప్‌లైన ద్వారా ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్నచెరువుల్లోకి చేరాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఎంతో ఉపయోగకరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగివారిపల్లె సర్పంచు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:47 PM