ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లలితాదేవిగా వాసవీమాత

ABN, Publish Date - Oct 06 , 2024 | 11:56 PM

దసరా శరన్నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మదనపల్లె పట్ట ణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి లలితాదేవి అలంకరణ లో భక్తులను కటాక్షించారు.

మదనపల్లె అర్బన, అక్టోబరు6: దసరా శరన్నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మదనపల్లె పట్ట ణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి లలితాదేవి అలంకరణ లో భక్తులను కటాక్షించారు. కోర్టులో వెలసిన గంగమ్మకు కొబ్బరి అలంకరణ భక్తులకు దర్శనమివ్వగా, నీరుగట్టు వారిపల్లెలోని చౌడేశ్వరీదేవి వెండికవచ ధారణలో కటా క్షించారు. దేవతానగర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవిగా, సోమేశ్వరస్వామిఆలయంలో మహాలక్ష్మీగాను భక్తులకు దర్శనమిచ్చారు. అనపగుట్టలో ఉన్న అభయలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో లక్ష్మీదేవికి నాగవల్లి దళాలతో భక్తులకు దర్శనమిచ్చారు.

నిమ్మనపల్లిలో: దశరా నవరాత్రులు సంధర్బంగా నిమ్మన పల్లి పంచాయతి పెద్దమాదిగపల్లి వెలసిన మాతమ్మతల్లి ఆలయంలో మూడవ రోజు అమ్మవారు లలితాత్రిపురసుం దరీ దేవిగా భక్తులకు దర్శనమించ్చారు.

కలకడలో:మండలంలోని కోన చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం అమ్మవారు లలితాత్రిపురసుందరి దేవిగా పూజ లందుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చన, అభిషేకం విశేష పూజలను చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు.

వాల్మీకిపురంలో: శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా ఆది వారం వాల్మీకిపురం మండలంలోని సత్యమ్మతల్లి దేవత లలితాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. కోనేటివీధి లోని లక్ష్మీకామేశ్వర ఆలయంలో వారాహి దేవిగాను, బజా రు వీధిలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో మూగాంబికా దేవిగానూ, నల్లవీరగంగాభవానీ ఆలయంలో వారాహి గాను, చింతపర్తి వీసవి ఆలయంలో దుర్గమ్మదేవిగా, గొల్లపల్లెలోని విరూపాఽక్షమ్మ తల్లి లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులను కటాక్షించారు.

ములకలచెరువులో: స్థానిక పీటీఎం రోడ్డులో వెలసిన వాసవి కన్యాకాపరమేశ్వరిదేవి అమ్మవారు ఆదివారం పార్వ తీ తనయ గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమి చ్చా రు.్ల అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిం చుకుని పూజలు చేశారు.

కలికిరిలో: దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రామ దేవత ఎల్లమ్మ ఆదివారం అన్నపూర్ణాదేవి అవతారంలో కటాక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

పీలేరులో: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పీలేరు నెహ్రూబజారులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమి చ్చారు. మోడల్‌ కాలనీ వద్దనున్న ఎల్లమ్మ, ఇందిరమ్మ కాలనీ వద్దనున్న దిన్నె గంగమ్మలు లలితా త్రిపుర సుం దరి అలంకారంలో దర్శనమిచ్చారు. పీలేరు గ్రామదేవత రౌద్రాల అంకాళమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. .

రామసముద్రంలో: మండలంలోని ఆర్‌.నడింపల్లె పంచా యతీ శ్రీరాములపల్లె గ్రామంలో వెలసిన దుర్గేశ్వరిదేవి నవరాత్రులలో భాగంగా త్రిపుర సుందరీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈసందర్భంగా బెంగళూరు నుంచి పలు రకాల పుష్పాలు తెప్పించి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Oct 06 , 2024 | 11:56 PM