విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి: ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:50 PM
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కో రుతూ రాష్ట్ర వ్యా ప్త నిరసనలో భాగంగా కడపలో ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కడప (సెవెనరోడ్స్), అక్టోబరు 1 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కో రుతూ రాష్ట్ర వ్యా ప్త నిరసనలో భాగంగా కడపలో ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దురాహుల్, వీరపోగు రవిలు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కుపై కడప ఉక్కుపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే రాబోవు రోజుల్లో విద్యార్థులు యువకులతో పెద్దఎత్తున పోరాటాలకు నాంది పలకాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్, డీవైఎ్‌ఫఐ జిల్లా నాయకులు నిర్మల్, నగర కన్వీనరు విజయ్, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు అభినయ్ పాల్గొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 11:51 PM