ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోక్షం ఎప్పుడు..?

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:25 PM

గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు వసతుల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. సచివాలయాలు తప్ప నిత్యం ప్రజలకు అవసరమయ్యే ప్రభుత్వ కార్యాలయలను పునర్మించికపోవడంతో నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారు.

గండికోట బ్యాక్‌వాటర్‌లో మునిగి ఉన్న కొండాపురం తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు

గండికోట ముంపునకు గురైన ప్రభుత్వ కార్యాలయాలు

కొండాపురం, సెప్టెంబరు 21: గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు వసతుల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. సచివాలయాలు తప్ప నిత్యం ప్రజలకు అవసరమయ్యే ప్రభుత్వ కార్యాలయలను పునర్మించికపోవడంతో నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో ముంపునకు గురైన ప్రభుత్వ కార్యాలయాలను గత ఐదేళ్లలో ఒక్కటి కూడా నిర్మించలేదు.ఐదేళ్లలో ప్రభుత్వ కార్యాలయల నిర్మాణం కోసం గత ప్రభుత్వం 10 సార్లు పైగా టెండర్లు పిలిచిన ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. గతంలో నిర్మించిన ముంపునకు గురి కాని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ముంపునకు గురైన వాటిని సర్దుబాటు చేసి నెట్టుకొస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని పాత స్టేట్‌బ్యాంక్‌ భవనంలో, ఎంపీడీవో కార్యాల యాన్ని అంగన్‌వాడీ కేంద్రంలో, పశువుల ఆసు పత్రిని పాత పీహెచ్‌సీలో, కొండాపురం పోలీస్‌స్టేషన్‌ను ముచ్చుమర్రి ప్రభుత్వ పాఠశాలలోను ఏర్పాటుచేసి తాత్కాలికంగా సేవలు నిర్వహిస్తున్నారు. తా ళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలికంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసి అందులో నుంచే పాలన సాగిస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో మోక్షం కలిగేనా..?

గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు టెండర్లు పిలిచినప్పటికీ బిల్లు లు రావన్న భయంతో టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.దీంతో కార్యాలయాల నిర్మాణం గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమయింది.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు దీరడంతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వెంటనే చేపట్టాలని నిర్వాసితులు కోరుతు న్నారు.ఈ విషయమై జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా టెండర్ల ప్రక్రియ తమ చేతుల్లో లేదని తెలిపారు. కాగా గత ప్రభుత్వంలో పిలిచిన అన్ని టెం డర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా టెండర్లు పిలిచి వెంటనే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:27 PM