ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే

ABN, Publish Date - Dec 21 , 2024 | 11:29 PM

పీలేరు ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ్జ్జసమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

యల్లెల రెడ్డప్ప రెడ్డి, ఎనఎంయూఏ నాయకులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పీలేరు ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ్జ్జసమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన అసోసి యేషన(ఎనఎంయూఏ) గౌరవాధ్యక్షుడుగా నియమితులైన యల్లెల రెడ్డప్పరెడ్డితో పాటు ఆ సంఘ నేతలను ఎమ్మెల్యే శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగు లకు గత ప్రభుత్వం నిలిపివేసిన నైట్‌ అలవెన్సులను కూటమి ప్రభు త్వం రాగానే మరలా మంజూరు చేసిందన్నారు. పీలేరు డిపోకు కొత్త బస్సులు మంజూరుతోపాటు దూరప్రాంత సర్వీసులకు అనుమతి వం టి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఎనఎంయూఏ నూతన కార్యవర్గానికి ఎన్నికైన సభ్యులు కార్మికులు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎనఎంయూఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి వినోద్‌ బాబు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఎం రాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రమీలమ్మ, పీలేరు డిపో అధ్యక్షులు సీవీ రమణ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 11:29 PM