ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: కొడుకును చూసి తల్లి కన్నీళ్లు.. జగన్ రియాక్షన్ చూడాల్సిందే..

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:10 AM

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు.

YS Jagan and Vijayamma

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు. భార్య విజయలక్ష్మి, కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan), కుమార్తె షర్మిలతో పాటు వారి కుటుంబ సభ్యులు తండ్రికి నివాళులర్పించారు. తొలుత విజయలక్ష్మి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకోగా.. ఆ తర్వాత జగన్.. షర్మిల చేరుకున్నారు. మొదట కుమారుడు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మితో కలిసి నివాళులర్పించారు. చివరిగా కుమారుడిని చూసి ఒక్కసారిగా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్ తన తల్లిని హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. విజయలక్ష్మి మాత్రం జగన్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత బహిరంగంగా విజయలక్ష్మి, జగన్ కలుసుకోవడం ఇదే తొలిసారి.

Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!


విజయలక్ష్మి కన్నీళ్లు..

ఎన్నికల వేళ కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన షర్మిలకు విజయలక్ష్మికి మద్దతు ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు ఆమె నిర్ణయాన్ని బహిరంంగా వ్యతిరేకించారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో విజయమ్మలక్ష్మిపై వైసీపీ నేతలు అనేక విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఆమె తీరును తప్పుబట్టారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ జయంతి కార్యక్రమంలోనే వారిద్దరూ కలిసి మీడియాకు కనిపించారు. తండ్రికి నివాళులర్పించి జగన్ వెళ్లిపోయే సమయంలో విజయలక్ష్మి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర


షర్మిలతో విజయమ్మ..

జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి వెళ్లిన కొద్దిసేపటికి షర్మిల చేరుకున్నారు. తల్లి విజయలక్ష్మి కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడలో కార్యక్రమం ఉండటంతో షర్మిల విజయవాడకు బయలుదేరారు.


Amaravati : సంక్షోభంలో ఇంధనం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 08 , 2024 | 12:11 PM

Advertising
Advertising
<