కాకినాడ జేఎన్‌టీయూలో వచ్చే నెల 28, 29న క్రియ పిల్లల పండుగ
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:52 AM
డిసెంబరు 28, 29 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూలో క్రియ పిల్లల పండుగ నిర్వహించనున్నారు.
కలెక్టరేట్ (కాకినాడ), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 28, 29 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూలో క్రియ పిల్లల పండుగ నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ఈ మేరకు పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. దీనిలో 11వ రాష్ట్రస్థాయి అంతర పాఠశాలలల సాంస్కృతిక పోటీలు జరుగుతాయి. విద్యార్థులకు నాటికలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం, పాటలు, పోస్టర్ ప్రజెంటేషన్, కథా రచన, చిత్రలేఖనం, బుర్రకథ, జానపద నృత్యం, విచిత్ర వేషధారణ, కథ చెప్పడం, వాద్య సంగీతం తదితర పోటీలు నిర్వహిస్తారు. 400 పాఠశాలల నుంచి సుమారు 12వేల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.క్రియఆన్‌లైన్.ఓఆర్‌జీ ద్వారా స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Updated Date - Nov 20 , 2024 | 04:52 AM