ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kesineni Chinni: చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానిది కాదు

ABN, Publish Date - Feb 20 , 2024 | 12:43 PM

క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపునిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.

విజయవాడ: క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ (Kesineni Foundation) ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపునిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని (Kesineni Chinni), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), టీడీపీ (TDP) నేతలు క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. విజయవాడ పార్లమెంటు అభివృద్ధిపై కేశినేని నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు సవాల్ విసరడం కాదని.. తనతో చర్చకు రావాలని నానికి చిన్ని సవాల్ విసిరారు.

చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానిది కాదని చిన్ని పేర్కొన్నారు. కేశినేని స్థాయి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేశినేని నానికి మతిభ్రమించిందన్నారు. దమ్ముంటే కేశినేని నాని తనతో డిబేట్‌కి రావాలన్నారు. కేశినేని నాని ఊసరవెల్లి లాంటిదన్నారు. విజయవాడ పార్లమెంటు ప్రజలు కేశినేని నానిని అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబు విజన్‌ని టాటా ట్రస్ట్ అధినేత రతన్ టాటా (Rathan Tata) ఎన్నో సార్లు ప్రశంసించారన్నారు. తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని స్వయానా రతన్ టాటా చెప్పారన్నారు. ప్రజా జీవితంలో కేశినేని నాని కనుమారుగయ్యారన్నారు. మీడియాకి మాత్రమే నాని పరిమితమయ్యారని కేశినేని చిన్ని తెలిపారు.

Updated Date - Feb 20 , 2024 | 12:43 PM

Advertising
Advertising