ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada : వరద నష్టం రూ.1,000 కోట్లు!

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:58 AM

కృష్ణానది, బుడమేరు వరద ఎన్‌టీఆర్‌ జిల్లా పరిధిలో అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1,000 కోట్ల వరకూ ఉంటుంది.

విజయవాడ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కృష్ణానది, బుడమేరు వరద ఎన్‌టీఆర్‌ జిల్లా పరిధిలో అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1,000 కోట్ల వరకూ ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు, సేవలు అందించే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.532.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వ్యవసాయం, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్‌ వంటి శాఖల్లో భారీ నష్టం సంభవించింది. రవాణా రంగానికి రూ.34.50 కోట్లు, పర్యాటక రంగానికి రూ.20కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు 950 కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయి. ఇంకా విద్యుత్తు, రెవెన్యూ, పంచాయత్‌ శాఖలకు సంబంధించి ప్రాథమిక నష్ట అంచనాలు రావాల్సి ఉంది. వీఎంసీకి భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అంతులేని పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలో పొందుపరిచారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి రూ.200కోట్ల నష్టం సంభవించింది.

జిల్లాకు తక్షణ సాయంగా రూ.125.12 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది. అలాగే జిల్లావ్యాప్తంగా 800 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినగా రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పూర్తిస్థాయి నష్ట అంచనాలను మరో రెండు రోజుల్లో ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం చేయనున్నారు. కృష్ణానది వరదలతో భవానీ ద్వీపం మొదటిసారి పూర్తిగా మునిగిపోయింది. స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉండే నాలుగు కాటేజీలలోని ఖరీదైన ఫర్నిచర్‌, ఇతర ఉపకరణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోబోటిక్‌ పార్క్‌, మేజ్‌ గార్డెన్‌, మిర్రర్‌ మేజ్‌, వీడియోగేమ్‌ ఎరీనా, చైల్డ్‌ గేమ్‌ ఏరియా, ఓపెన్‌ జిమ్‌, ఓపెన్‌ మ్యూజిక్‌ ఎరీనా మునిగిపోయాయి. అలాగే హరిత బెర్మ్‌ పార్క్‌లో 30 కాటేజీలు నీట మునిగాయి. వీటిలోని ఖరీదైన సామగ్రి వరద నీటిలో నానిపోయింది. కాన్ఫరెన్స్‌ హాల్‌, బోటింగ్‌ యూనిట్‌ వంటివి పూర్తిగా మునిగిపోయాయి. పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీపీ)కి రూ.20కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.


  • భారీగా ఆదాయం కోల్పోయిన రైల్వే

విజయవాడ రైల్వే డివిజన్‌ వరదల కారణంగా రూ.30కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోయింది. డివిజన్‌ పరిధిలో 75శాతం రైళ్లను గత ఐదు రోజులుగా రద్దు చేశారు. ఈ కారణంగా రోజుకు సగటున రూ.3.79 కోట్ల చొప్పున రూ.19కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గూడ్స్‌ పరంగా చూస్తే మరో 11 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇక భారీవర్షాల కారణంగా రోడ్డు ర వాణా సంస్థ(ఆర్టీసీ) విజయవాడ రీజియన్‌ పరిధిలో రూ.2.50కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవటంతో పాటు నష్టం వాటిల్లింది. నాలుగు రోజులుగా సగానికి పైగా బస్సులు తిరగకపోవటం వల్ల రూ.1.50 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. విద్యాధరపురంలోని సీఎన్‌జీ ఐబీఎస్‌ ప్లాంట్‌, డీజిల్‌ బంక్‌ మునిగిపోవటంతో పాటు, 20కి పైగా బస్సులు 3 అడుగుల లోతు నీటిలోనే ఇంకా మునిగి ఉన్నాయి. డిపోల్లోకి వరద నీరు రావడంతో టూల్స్‌, స్పేర్‌ పార్టులు కొట్టుకుపోయాయి.

Updated Date - Sep 06 , 2024 | 04:59 AM

Advertising
Advertising